Ettunnado neesittamu yeddaudaa neramgaraadu

ఎట్టున్నదో నీచిత్తము యెద్దౌతా నెరఁగరాదు
Language

(॥పల్లవి॥)
ఎట్టున్నదో నీచిత్తము యెద్దౌతా నెరఁగరాదు
ముట్టి నీవు చూడఁగాను మోహించితి నేను

(॥ఎట్టు॥)
చివ్వన నే విన్నపాలు సేయఁగాను వినివిని
నవ్వులు నీవు నవ్వంగా నమ్మితి నేను
జవ్వనమదాన నేను సన్న సేయఁగా నప్పుడే
పవ్వళించఁగా నాసలభ్రమసితి నేను

(॥ఎట్టు॥)
బెరసి నీకొంగువట్టి పెసఁగితే నటు నీవు
శిరసు వంచఁగా సంతోసించితి నేను
వొరసి పాదాలోత్తితే వూరకే నీవుండఁగాను
వొరిమితోఁ జెంగలించి వుండితి నేను

(॥ఎట్టు॥)
వేడుక నేఁ గూడేవేళ వెరగంది నీవుండఁగా
జోడువాయవని మతిఁజొక్కతి నేను
వాడికకుఁ బిల్వంగా నావంకైతే శ్రీవేంకటేశ
వీడెము చేతఁబట్టుక వెలసితి నేను

(||pallavi||)
ĕṭṭunnado nīsittamu yĕddaudā nĕram̐garādu
muṭṭi nīvu sūḍam̐gānu mohiṁchidi nenu

(||ĕṭṭu||)
sivvana ne vinnabālu seyam̐gānu vinivini
navvulu nīvu navvaṁgā nammidi nenu
javvanamadāna nenu sanna seyam̐gā nappuḍe
pavvaḽiṁcham̐gā nāsalabhramasidi nenu

(||ĕṭṭu||)
bĕrasi nīgŏṁguvaṭṭi pĕsam̐gide naḍu nīvu
śhirasu vaṁcham̐gā saṁtosiṁchidi nenu
vŏrasi pādālottide vūrage nīvuṁḍam̐gānu
vŏrimidom̐ jĕṁgaliṁchi vuṁḍidi nenu

(||ĕṭṭu||)
veḍuga nem̐ gūḍeveḽa vĕragaṁdi nīvuṁḍam̐gā
joḍuvāyavani madim̐jŏkkadi nenu
vāḍigagum̐ bilvaṁgā nāvaṁkaide śhrīveṁkaḍeśha
vīḍĕmu sedam̐baṭṭuga vĕlasidi nenu