ఎట్టున్నదో నీమనసు యెఱఁగ నేను
(॥పల్లవి॥)
ఎట్టున్నదో నీమనసు యెఱఁగ నేను
యిట్టె యీ చేఁతలెల్ల యితవులే సుమ్మీ
(॥ఎట్టు॥)
చనవున నీతోను చవులు పుట్టించెఁగాని
పెనఁగులాడదు సుమ్మి ప్రియురాలు
కనుఁగొనలను నిన్నుఁగామించి చూచెఁ గాని
సునిసి నీపై మొనలు చూపదుసుమ్మి
(॥ఎట్టు॥)
పలుమారు సిగ్గు నీపఁ బచారించె నింతెకాని
సెలవి నవ్వదు సుమ్మి చిగురుఁ బోణి
సొలపులనటనలు తెలిపె నింతేకాని
అలాకతో వెక్కసము లాడదు సుమ్మీ
(॥ఎట్టు॥)
భారవుగుబ్బల నొత్తి బత్తిసేసె నింతెకాని
తేరకొని చలము సాదించదు సుమ్మి
యీరీతి శ్రీ వేంకటేశ యీకె నిన్నుఁ గూడెఁ గాని
మేరమీరి నీతో మందెళము గాదు సుమ్మి
(||pallavi||)
ĕṭṭunnado nīmanasu yĕṟam̐ga nenu
yiṭṭĕ yī sem̐talĕlla yidavule summī
(||ĕṭṭu||)
sanavuna nīdonu savulu puṭṭiṁchĕm̐gāni
pĕnam̐gulāḍadu summi priyurālu
kanum̐gŏnalanu ninnum̐gāmiṁchi sūsĕm̐ gāni
sunisi nībai mŏnalu sūbadusummi
(||ĕṭṭu||)
palumāru siggu nībam̐ basāriṁchĕ niṁtĕgāni
sĕlavi navvadu summi sigurum̐ boṇi
sŏlabulanaḍanalu tĕlibĕ niṁtegāni
alāgado vĕkkasamu lāḍadu summī
(||ĕṭṭu||)
bhāravugubbala nŏtti battisesĕ niṁtĕgāni
teragŏni salamu sādiṁchadu summi
yīrīdi śhrī veṁkaḍeśha yīgĕ ninnum̐ gūḍĕm̐ gāni
meramīri nīdo maṁdĕḽamu gādu summi