Ettunnado neemanasu yeṟamga nenu

ఎట్టున్నదో నీమనసు యెఱఁగ నేను
Language

(॥పల్లవి॥)
ఎట్టున్నదో నీమనసు యెఱఁగ నేను
వెట్టి కొసరులు నీపై వేయఁగవచ్చేనా

(॥ఎట్టు॥)
అప్పుడు నీవాడినట్టి ఆమాఁటపట్టుకే, మోవి
పిప్పిగట్ట సారె సారెఁ బెనఁగేఁగాక
వుప్పతించి వొలసియునొల్లనివల పెప్పుడు
చప్పనే కాదా నిన్ను సాదించవచ్చేనా

(॥ఎట్టు॥)
మచ్చిక నీవు మొదలమన్నించినమన్ననకు
చెచ్చెర నీకొలువు సేసేఁగాక
ముచ్చటదీరఁగ నీకు మొగచాటైనమాఁటలు
తుచ్చములే కావా నీపై దొరలించేనా

(॥ఎట్టు॥)
గక్కున నన్నుఁ గాఁగిట కాఁగిలించినందుకే
లక్కవలె నిన్ను నేఁ గలసితిఁగాక
యిక్కువ శ్రీవేంకటేశ యింతేసి సేసినందుకు
చొక్కపుమేలే యింకా సోదించేనా

(||pallavi||)
ĕṭṭunnado nīmanasu yĕṟam̐ga nenu
vĕṭṭi kŏsarulu nībai veyam̐gavachchenā

(||ĕṭṭu||)
appuḍu nīvāḍinaṭṭi āmām̐ṭabaṭṭuge, movi
pippigaṭṭa sārĕ sārĕm̐ bĕnam̐gem̐gāga
vuppadiṁchi vŏlasiyunŏllanivala pĕppuḍu
sappane kādā ninnu sādiṁchavachchenā

(||ĕṭṭu||)
machchiga nīvu mŏdalamanniṁchinamannanagu
sĕchchĕra nīgŏluvu sesem̐gāga
muchchaḍadīram̐ga nīgu mŏgasāḍainamām̐ṭalu
tuchchamule kāvā nībai dŏraliṁchenā

(||ĕṭṭu||)
gakkuna nannum̐ gām̐giḍa kām̐giliṁchinaṁduge
lakkavalĕ ninnu nem̐ galasidim̐gāga
yikkuva śhrīveṁkaḍeśha yiṁtesi sesinaṁdugu
sŏkkabumele yiṁkā sodiṁchenā