Ettunnado nee manasu yemi seduraa

ఎట్టున్నదో నీ మనసు యేమి సేతురా
Language

(॥పల్లవి॥)
ఎట్టున్నదో నీ మనసు యేమి సేతురా
యెట్ట నెదుటఁ బాయలే నేమి సేతురా

(॥ఎట్టు॥)
చూచుదాఁకా వేగిరింత సొంపుగా విభుఁడ నీతో
దాఁచి మాటాడినదాఁకఁ దమకింతును
చేచేతఁ దమకింతు చేరువదాఁకా నిట్లనె
యేచి తమకమే నిండె నేమి సేతురా

(॥ఎట్టు॥)
అట్టె నీ చెనకులకు నాసగింతుఁ దనివోక
ముట్టి యాసగింతు నీ మోవితేనెకు
గట్టిగా నంతటిమీఁద కాఁగిటికి నాసగింతు
యెట్టైనా నాసలే నిండె నేమి సేతురా

(॥ఎట్టు॥)
అదన నీ మే నంటి అట్టె పరమశ మవుదు
వదలక కూడి పరవశ మవుదును
పొదలి శ్రీవెంకటేశ పొందితిని నన్ను నిట్టె
యెదిరించెఁ బరవశా లేమి సేతురా

(||pallavi||)
ĕṭṭunnado nī manasu yemi sedurā
yĕṭṭa nĕduḍam̐ bāyale nemi sedurā

(||ĕṭṭu||)
sūsudām̐kā vegiriṁta sŏṁpugā vibhum̐ḍa nīdo
dām̐si māḍāḍinadām̐kam̐ damagiṁtunu
sesedam̐ damagiṁtu seruvadām̐kā niṭlanĕ
yesi tamagame niṁḍĕ nemi sedurā

(||ĕṭṭu||)
aṭṭĕ nī sĕnagulagu nāsagiṁtum̐ danivoga
muṭṭi yāsagiṁtu nī movidenĕgu
gaṭṭigā naṁtaḍimīm̐da kām̐giḍigi nāsagiṁtu
yĕṭṭainā nāsale niṁḍĕ nemi sedurā

(||ĕṭṭu||)
adana nī me naṁṭi aṭṭĕ paramaśha mavudu
vadalaga kūḍi paravaśha mavudunu
pŏdali śhrīvĕṁkaḍeśha pŏṁdidini nannu niṭṭĕ
yĕdiriṁchĕm̐ baravaśhā lemi sedurā