ఎట్టున్నదో మీ చిత్తా లెవ్వ రెఱుఁగుదురు
(॥పల్లవి॥)
ఎట్టున్నదో మీ చిత్తా లెవ్వ రెఱుఁగుదురు
జట్టిగొని యింతలోనే జాగులేఁటికయ్యా
(॥ఎట్టు॥)
మనసిచ్చి నీతోను మాటలెల్లా నాడెఁ జెలి
చనవిచ్చి యేమన్నా సమ్మతించెను
తనువిచ్చి నీయెడకుఁదగినకాఁగిటఁ గూడె
తనియ వేమిచ్చినాను తమకించేవయ్యా
(॥ఎట్టు॥)
పేరుకొని నీమీఁదిబీరపుఁ బదాలు వాడె
తేరకొని నిన్నుఁ జూచి తేలిమెచ్చెను
మారుకొని సరసాన మాఁటికి మాఁటికి నవ్వె
కోరుకొని వుంటి వింక కొసరేఁటికయ్యా
(॥ఎట్టు॥)
పులకించెఁ దనమేను పొందిన నీరతులలో
చిలికించె వలపులు చెక్కులునొక్కి
పలికించె నీవు రతిఁ బరవశమైతేను
వులికించేవు శ్రీ వేంకటోత్తముఁడ గోరను
(||pallavi||)
ĕṭṭunnado mī sittā lĕvva rĕṟum̐guduru
jaṭṭigŏni yiṁtalone jāgulem̐ṭigayyā
(||ĕṭṭu||)
manasichchi nīdonu māḍalĕllā nāḍĕm̐ jĕli
sanavichchi yemannā sammadiṁchĕnu
tanuvichchi nīyĕḍagum̐daginagām̐giḍam̐ gūḍĕ
taniya vemichchinānu tamagiṁchevayyā
(||ĕṭṭu||)
perugŏni nīmīm̐dibīrabum̐ badālu vāḍĕ
teragŏni ninnum̐ jūsi telimĕchchĕnu
mārugŏni sarasāna mām̐ṭigi mām̐ṭigi navvĕ
korugŏni vuṁṭi viṁka kŏsarem̐ṭigayyā
(||ĕṭṭu||)
pulagiṁchĕm̐ danamenu pŏṁdina nīradulalo
siligiṁchĕ valabulu sĕkkulunŏkki
paligiṁchĕ nīvu radim̐ baravaśhamaidenu
vuligiṁchevu śhrī veṁkaḍottamum̐ḍa goranu