Ettumduno neesitta midiyellaa garvamamtaa

ఎట్టుండునో నీచిత్త మిదియెల్లా గర్వమంటా
Language

(॥పల్లవి॥)
ఎట్టుండునో నీచిత్త మిదియెల్లా గర్వమంటా
పట్టిన పంతమే కాక పచ్చి సేయ నేర్తుగా

(॥ఎట్టుం॥)
నీమోము చూచినంతనే నిలువెల్లా మఱచితి
నేమానఁ బ్రియము చెప్పనేర్తునా నేను
కామించి నీమాఁట విని కన్నులు దేలవేసితి-
నేమైనా వెనకముందు యెంచనేర్తునా

(॥ఎట్టుం॥)
వొద్దికి వచ్చినప్పుడే వొరగితి నీమీఁద
బుద్దితోడ నీకు మొక్కఁ బొద్దుగలదా
అద్దివో నీవు నవ్వితే నంతలోనే కళదాఁకె
అద్దపు నీచెక్కు నొక్కి ఆదరించనేర్తునా

(॥ఎట్టుం॥)
చేయివట్టి తీసితేనే సేసవెట్టితి నంతలో
చాయల నిన్నెదురుకో సందుగలదా
యీయెడ శ్రీవేంకటేశ యింతలోనే కూడితివి
వేయిటికైనా నింక వెలితున్నదా

(||pallavi||)
ĕṭṭuṁḍuno nīsitta midiyĕllā garvamaṁṭā
paṭṭina paṁtame kāga pachchi seya nerdugā

(||ĕṭṭuṁ||)
nīmomu sūsinaṁtane niluvĕllā maṟasidi
nemānam̐ briyamu sĕppanerdunā nenu
kāmiṁchi nīmām̐ṭa vini kannulu delavesidi-
nemainā vĕnagamuṁdu yĕṁchanerdunā

(||ĕṭṭuṁ||)
vŏddigi vachchinappuḍe vŏragidi nīmīm̐da
buddidoḍa nīgu mŏkkam̐ bŏddugaladā
addivo nīvu navvide naṁtalone kaḽadām̐kĕ
addabu nīsĕkku nŏkki ādariṁchanerdunā

(||ĕṭṭuṁ||)
seyivaṭṭi tīsidene sesavĕṭṭidi naṁtalo
sāyala ninnĕdurugo saṁdugaladā
yīyĕḍa śhrīveṁkaḍeśha yiṁtalone kūḍidivi
veyiḍigainā niṁka vĕlidunnadā