ఎట్టుగూడెఁ బెండ్లియోగ మిద్దరికి నీవేళ
(॥పల్లవి॥)
ఎట్టుగూడెఁ బెండ్లియోగ మిద్దరికి నీవేళ
అట్టె లక్ష్మీనారాయణయోగము
(॥ఎట్టు॥)
నెలఁత కమలవాసి నీవు కమలాక్షుఁడవు
పొలఁతికి నీకుఁ గూడె పొంతనాలు
వలుద చక్రవాకాలు వనితకుచాలు నీవు
యెలమిఁ జక్రాయుధుఁడ విద్దరికిఁ దగును
(॥ఎట్టు॥)
తరుణి నీలకుంతలిఁ తగు నీలవర్ణుఁడవు
సరుస మీకే తగు సమ్మంధము
నిరతి హేమవ ర్ణాకె నీవు పీతాంబరుఁడవు
సరవి నిద్దరి కొక్కజాతియ్యము
(॥ఎట్టు॥)
పాలవెల్లిఁ బుట్టె నాకె పాలవెల్లి యిల్లు నీకు
మేలు మేలు యిద్దరికి మేనవావి
యీలీల శ్రీవేంకటేశ యింతి నీవు గూడితివి
సోలి మాకుఁ బెట్టరాదా సోబనవిడేలు
(||pallavi||)
ĕṭṭugūḍĕm̐ bĕṁḍliyoga middarigi nīveḽa
aṭṭĕ lakṣhmīnārāyaṇayogamu
(||ĕṭṭu||)
nĕlam̐ta kamalavāsi nīvu kamalākṣhum̐ḍavu
pŏlam̐tigi nīgum̐ gūḍĕ pŏṁtanālu
valuda sakravāgālu vanidagusālu nīvu
yĕlamim̐ jakrāyudhum̐ḍa viddarigim̐ dagunu
(||ĕṭṭu||)
taruṇi nīlaguṁtalim̐ tagu nīlavarṇum̐ḍavu
sarusa mīge tagu sammaṁdhamu
niradi hemava rṇāgĕ nīvu pīdāṁbarum̐ḍavu
saravi niddari kŏkkajādiyyamu
(||ĕṭṭu||)
pālavĕllim̐ buṭṭĕ nāgĕ pālavĕlli yillu nīgu
melu melu yiddarigi menavāvi
yīlīla śhrīveṁkaḍeśha yiṁti nīvu gūḍidivi
soli māgum̐ bĕṭṭarādā sobanaviḍelu