ఎత్తుకొన్న బహురూప మిఁక మరి మానరాదు
(॥పల్లవి॥)
ఎత్తుకొన్న బహురూప మిఁక మరి మానరాదు
చిత్తగించి మన్నించు శ్రీనరసింహా
(॥ఎత్తు॥)
పట్టి ప్రహ్లాదునికై కంబములోన నుండితివి
గట్టిగా కనకదైత్యు ఖండించితివి
యిట్టి నీచేఁతలు విని యిందరుఁ గొల్చేరు నిన్ను
కట్టుకొంటి వింతపని ఘననారసింహా
(॥ఎత్తు॥)
దేవతల మొరాలించి దీకొంటి వింతపనికి
చేవ నభయము లిచ్చి చేయె త్తితివి
దేవుఁడ వని యెఱిఁగి త్రిజగాలు మొక్కె నీకు
నీవల్లనే వచ్చె నిది నిత్యనారసింహా
(॥ఎత్తు॥)
భూకాంతవిన్నపము పొంచి విని గురైతివి
శ్రీకాంత తొడమీఁదఁ జేకొంటివి
మీకును శ్రీవేంకటాద్రిమీఁదనే శరణంటిమి
దాకొనె మీమహిమలు దండినారసింహా
(||pallavi||)
ĕttugŏnna bahurūba mim̐ka mari mānarādu
sittagiṁchi manniṁchu śhrīnarasiṁhā
(||ĕttu||)
paṭṭi prahlādunigai kaṁbamulona nuṁḍidivi
gaṭṭigā kanagadaityu khaṁḍiṁchidivi
yiṭṭi nīsem̐talu vini yiṁdarum̐ gŏlseru ninnu
kaṭṭugŏṁṭi viṁtabani ghananārasiṁhā
(||ĕttu||)
devadala mŏrāliṁchi dīgŏṁṭi viṁtabanigi
seva nabhayamu lichchi seyĕ ttidivi
devum̐ḍa vani yĕṟim̐gi trijagālu mŏkkĕ nīgu
nīvallane vachchĕ nidi nityanārasiṁhā
(||ĕttu||)
bhūgāṁtavinnabamu pŏṁchi vini guraidivi
śhrīgāṁta tŏḍamīm̐dam̐ jegŏṁṭivi
mīgunu śhrīveṁkaḍādrimīm̐dane śharaṇaṁṭimi
dāgŏnĕ mīmahimalu daṁḍinārasiṁhā