ఎట్టు వలసినఁ జేయు మిఁక నీవు
(॥పల్లవి॥)
ఎట్టు వలసినఁ జేయు మిఁక నీవు
గుట్టు చక్కనైతేను కోరిక లీడేరును
(॥ఎట్టు॥)
చప్పనాయ నీమోవి సతులెల్లా నంజఁగాను
తెప్పిరి నే నంటఁగాను తియ్యనాయను
వుప్పుచాల దీలకూర కొల్లనివేళ నందురు
వుప్పొలి కినుమడౌను వొలిసిన వేళను
(॥ఎట్టు॥)
కడుఁ బిప్పాయ నీమేను కాంతలెల్లఁ బొందఁగాను
వడిసీ రసాలు నే నీవద్ద నుండఁగా
పుడిసెఁడౌను సిగ్గులు పుప్పించుకొనేవేళను
పిడికెడేసి వలపు పెట్టే సేసవేళను
(॥ఎట్టు॥)
బెండుపడె నీ మనసు పెనఁగి యిందరిచేతా
నిండుకొనెఁ దమి నేను నీవుఁ గూడఁగా
గుండె రాయౌ నొకవేళ కోపాన శ్రీ వేంకటేశ
కొండలౌను చన్నులివె కొంకుదేరేవేళను
(||pallavi||)
ĕṭṭu valasinam̐ jeyu mim̐ka nīvu
guṭṭu sakkanaidenu koriga līḍerunu
(||ĕṭṭu||)
sappanāya nīmovi sadulĕllā naṁjam̐gānu
tĕppiri ne naṁṭam̐gānu tiyyanāyanu
vuppusāla dīlagūra kŏllaniveḽa naṁduru
vuppŏli kinumaḍaunu vŏlisina veḽanu
(||ĕṭṭu||)
kaḍum̐ bippāya nīmenu kāṁtalĕllam̐ bŏṁdam̐gānu
vaḍisī rasālu ne nīvadda nuṁḍam̐gā
puḍisĕm̐ḍaunu siggulu puppiṁchugŏneveḽanu
piḍigĕḍesi valabu pĕṭṭe sesaveḽanu
(||ĕṭṭu||)
bĕṁḍubaḍĕ nī manasu pĕnam̐gi yiṁdarisedā
niṁḍugŏnĕm̐ dami nenu nīvum̐ gūḍam̐gā
guṁḍĕ rāyau nŏgaveḽa kobāna śhrī veṁkaḍeśha
kŏṁḍalaunu sannulivĕ kŏṁkudereveḽanu