ఎట్టు వలసినా వచ్చు నింతులమాట
(॥పల్లవి॥)
ఎట్టు వలసినా వచ్చు నింతులమాట
నెట్టుకొన్న వారివారి నేరుపులింతే
(॥ఎట్టు॥)
కప్పురపుధూళి మేనఁగలయ నలఁదినప్పు
డప్పుడే పో బలభద్రుఁ డని యందురు
కుప్పలైన తట్టుపుణుఁగునఁ దొప్పఁదోఁగీ నంటా
తప్పటి చెలులే క్రిష్ణుఁడని యందురు
(॥ఎంట్టు॥)
నీలవర్ణుఁ డితఁడు పన్నీరు జలకమాడె
యాలో సాలగ్రామరూపు మని యందురు
తాలిమి నిర్వాణాన తడిసూళ్లొత్తువేళ
పోలిచి నీ సతులెల్లా బుద్దుఁ డందురు
(॥ఎట్టు॥)
మించిన సొమ్ములతోన మిన్నుముట్టినవేళ
లంచలఁ ద్రివిక్రముఁ డని యుందురు
కొంచక యలమేలుమంగ కోరి మెడఁ గట్టుకొంటే
యెంచి శ్రీవేంకటపతి యితఁ డందురు
(||pallavi||)
ĕṭṭu valasinā vachchu niṁtulamāḍa
nĕṭṭugŏnna vārivāri nerubuliṁte
(||ĕṭṭu||)
kappurabudhūḽi menam̐galaya nalam̐dinappu
ḍappuḍe po balabhadrum̐ ḍani yaṁduru
kuppalaina taṭṭubuṇum̐gunam̐ dŏppam̐dom̐gī naṁṭā
tappaḍi sĕlule kriṣhṇum̐ḍani yaṁduru
(||ĕṁṭṭu||)
nīlavarṇum̐ ḍidam̐ḍu pannīru jalagamāḍĕ
yālo sālagrāmarūbu mani yaṁduru
tālimi nirvāṇāna taḍisūḽlŏttuveḽa
polisi nī sadulĕllā buddum̐ ḍaṁduru
(||ĕṭṭu||)
miṁchina sŏmmuladona minnumuṭṭinaveḽa
laṁchalam̐ drivikramum̐ ḍani yuṁduru
kŏṁchaga yalamelumaṁga kori mĕḍam̐ gaṭṭugŏṁṭe
yĕṁchi śhrīveṁkaḍabadi yidam̐ ḍaṁduru