Ettu valabimchidivi yimtagaa nannu

ఎట్టు వలపించితివి యింతగా నన్ను
Language

(॥పల్లవి॥)
ఎట్టు వలపించితివి యింతగా నన్ను
బట్టబయటనే నీ పంతమెల్లఁ జెల్లెను

(॥ఎట్టు॥)
తమకమే మీఁదమీఁద దైలువారుఁ గాని
ఆమరు నీరతిఁ దనివందదు మతి
తిమురుచు నీరపు దిష్టించి చూచీఁ గాని
తెమలి రెప్పముయ్యవు తెల్లని నాకన్నులు

(॥ఎట్టు॥)
చేరి నీతో మాటలకు సిగ్గులు వాపీఁ గాని
ఆరీతిఁ బొంది యలయవడియాసలు
మేరతో నీకాఁగిటికి మెరుఁగులెక్కీఁ గాని
బీరము మానవు నాబిరుదైన చన్నులు

(॥ఎట్టు॥)
కందువ నీకాఁగిటిలో కతలు నేరిపీఁ గాని
సందడినలయదు నాచల్లనిమేను
అంది శ్రీ వెంకటేశ నిన్నలమి మెచ్చీఁ గాని
గొందినొదుగదు నాకోరికతో గుణము

(||pallavi||)
ĕṭṭu valabiṁchidivi yiṁtagā nannu
baṭṭabayaḍane nī paṁtamĕllam̐ jĕllĕnu

(||ĕṭṭu||)
tamagame mīm̐damīm̐da dailuvārum̐ gāni
āmaru nīradim̐ danivaṁdadu madi
timurusu nīrabu diṣhṭiṁchi sūsīm̐ gāni
tĕmali rĕppamuyyavu tĕllani nāgannulu

(||ĕṭṭu||)
seri nīdo māḍalagu siggulu vābīm̐ gāni
ārīdim̐ bŏṁdi yalayavaḍiyāsalu
merado nīgām̐giḍigi mĕrum̐gulĕkkīm̐ gāni
bīramu mānavu nābirudaina sannulu

(||ĕṭṭu||)
kaṁduva nīgām̐giḍilo kadalu neribīm̐ gāni
saṁdaḍinalayadu nāsallanimenu
aṁdi śhrī vĕṁkaḍeśha ninnalami mĕchchīm̐ gāni
gŏṁdinŏdugadu nāgorigado guṇamu