ఎట్టు వలపించితివి యేమీ నెఱగని నన్ను
(॥పల్లవి॥)
ఎట్టు వలపించితివి యేమీ నెఱగని నన్ను
పట్టరాదు ప్రాయమిది పైపై నున్నదిరా
(॥॥)
వినుకలివిరహమే వేడుకలై తో చెగాని
కనుఁగొంటే దమకము కడుబెట్టురా
మనసునఁ దలఁచుటే మంచిదయి వుండీఁగాని
తనువు గాఁగిలించితే తతిగొనీ మఱపు
(॥॥)
తెమ్మలై తొంటికూటమి దిష్టమై వుండీఁగాని
కమ్మి మీఁదటికోరిక గాసిఁబెట్టీరా
చిమ్ముచు నీకెదురుచూచినదే యింపాయఁగాని
కమ్మర నంటితే గోరు కడువాఁడిరా
(॥॥)
మంచిదూతికలయెడ మాటలే చవాయఁగాని
కంచముపొత్తిచ్చితేనే కళదాఁకెరా
అంచల శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
యెంచి కూడితివి యిన్ని నియ్యకోలే యిఁకను
(||pallavi||)
ĕṭṭu valabiṁchidivi yemī nĕṟagani nannu
paṭṭarādu prāyamidi paibai nunnadirā
(||||)
vinugalivirahame veḍugalai to sĕgāni
kanum̐gŏṁṭe damagamu kaḍubĕṭṭurā
manasunam̐ dalam̐suḍe maṁchidayi vuṁḍīm̐gāni
tanuvu gām̐giliṁchide tadigŏnī maṟabu
(||||)
tĕmmalai tŏṁṭigūḍami diṣhṭamai vuṁḍīm̐gāni
kammi mīm̐daḍigoriga gāsim̐bĕṭṭīrā
simmusu nīgĕdurusūsinade yiṁpāyam̐gāni
kammara naṁṭide goru kaḍuvām̐ḍirā
(||||)
maṁchidūdigalayĕḍa māḍale savāyam̐gāni
kaṁchamubŏttichchidene kaḽadām̐kĕrā
aṁchala śhrī veṁkaḍeśha alamelumaṁga nenu
yĕṁchi kūḍidivi yinni niyyagole yim̐kanu