ఎట్టు సేసిననుఁ జెల్లు నిఁకనేల నిన్ను దూర
(॥పల్లవి॥)
ఎట్టు సేసిననుఁ జెల్లు నిఁకనేల నిన్ను దూర
వట్టియారడి నేనె వలచి వుండఁగను
(॥ఎట్టు॥)
జగడించి నేనలిగి చలముతోఁ దలవంచి
వగలతో వసివాడు వాడఁగాను
నగనేల ననుఁజూచి నయముననె నీవింత
పగసేయ వచ్చి ననుఁ బరచేవు గాక
(॥ఎట్టు॥)
జఱసి నీతో నేను సరివొట్టు వెట్టుకొని
పుఱవేదనలతోడఁ బొగులఁ గాను
మఱపించి నామీఁద నొఱగేవు నీకెంత
చెఱదాన నైతినో చెనకేవు గాక
(॥ఎట్టు॥)
కడుమదమున నిన్నుఁగన్నులనె జంకించి
పొడిఁబడి పానుపుపైఁ బొరలఁగాను
యెడ మిచ్చి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
వడి నాకు నెంతకైవశమైతో కాక
(||pallavi||)
ĕṭṭu sesinanum̐ jĕllu nim̐kanela ninnu dūra
vaṭṭiyāraḍi nenĕ valasi vuṁḍam̐ganu
(||ĕṭṭu||)
jagaḍiṁchi nenaligi salamudom̐ dalavaṁchi
vagalado vasivāḍu vāḍam̐gānu
naganela nanum̐jūsi nayamunanĕ nīviṁta
pagaseya vachchi nanum̐ barasevu gāga
(||ĕṭṭu||)
jaṟasi nīdo nenu sarivŏṭṭu vĕṭṭugŏni
puṟavedanaladoḍam̐ bŏgulam̐ gānu
maṟabiṁchi nāmīm̐da nŏṟagevu nīgĕṁta
sĕṟadāna naidino sĕnagevu gāga
(||ĕṭṭu||)
kaḍumadamuna ninnum̐gannulanĕ jaṁkiṁchi
pŏḍim̐baḍi pānububaim̐ bŏralam̐gānu
yĕḍa michchi śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
vaḍi nāgu nĕṁtagaivaśhamaido kāga