Ettu sesinaam jeyu menna neṟajaanavu nee

ఎట్టు సేసినాఁ జేయు మెున్న నెఱజాణవు నీ
Language

(॥పల్లవి॥)
ఎట్టు సేసినాఁ జేయు మెున్న నెఱజాణవు నీ-
చుట్టరికమే గురి సుదతి చేఁతలకు

(॥॥)
జలజాక్షిచూపులకు చక్కనినీమేను గురి
పిలిచేనోరికిని నీ పేరే గురి
తలపోఁతలకు నీతగినగుణాలే గురి
చెలులము నేమింత చెప్ప నేమున్నది

(॥॥)
కాంతచన్నులకు నీకందువకాఁగిలి గురి
బంతి నాపెచేతికి నీపాదాలే గురి
చెంత శిరసుపైకి నీసేపాలెప్పుడు గురి
వింతలుగా నీకు విన్నవించ నేమిటికి

(॥॥)
అతివరతులకు నీయధరామృతము గురి
మతిలోనియాసలకు మన్ననే గురి
ఇతవై శ్రీ వేంకటేశ యీపె నిట్టె యేలితివి
మితిలేని మీమహిమ మెచ్చఁగ మావసమా

(||pallavi||)
ĕṭṭu sesinām̐ jeyu mĕుnna nĕṟajāṇavu nī-
suṭṭarigame guri sudadi sem̐talagu

(||||)
jalajākṣhisūbulagu sakkaninīmenu guri
pilisenorigini nī pere guri
talabom̐talagu nīdaginaguṇāle guri
sĕlulamu nemiṁta sĕppa nemunnadi

(||||)
kāṁtasannulagu nīgaṁduvagām̐gili guri
baṁti nābĕsedigi nībādāle guri
sĕṁta śhirasubaigi nīsebālĕppuḍu guri
viṁtalugā nīgu vinnaviṁcha nemiḍigi

(||||)
adivaradulagu nīyadharāmṛtamu guri
madiloniyāsalagu mannane guri
idavai śhrī veṁkaḍeśha yībĕ niṭṭĕ yelidivi
midileni mīmahima mĕchcham̐ga māvasamā