Ettu sesinaam jeyi yemanamgamgala ninnu

ఎట్టు సేసినాఁ జేయి యేమనఁగఁగల నిన్ను
Language

(॥పల్లవి॥)
ఎట్టు సేసినాఁ జేయి యేమనఁగఁగల నిన్ను
పట్టిన వ్రతము నీకే పాలుపెట్టేఁగాక

(॥ఎట్టు॥)
అలుకల సొలయచు నట్టె నీతోఁ బెనఁగుచు
చలము సాదించేనా సారెసారెకు
తొలుత నమ్మించితివి దోసముఁబుణ్యము నీది
మెలఁగి పాయము నీకే మీఁదుకట్టేఁగాక

(॥ఎట్టు॥)
పొంతల చన్నులనొత్తి బొమ్మలను జంకించి
పంతము నీచేఁ గొనేనా బలిమితోను
చింతతో నన్నేలిన సిగ్గుపట్టెల్లా నీది
బంతి నాయాసలు నీపై వేసేఁగాక

(॥ఎట్టు॥)
నెట్టన నిన్నుఁ గూడితి నేరుపులెల్లాఁ జూపితి
అట్టె నిన్నలయించేనా ఆరడిగాను
కట్టుకో శ్రీ వేంకటేశ కడుఁ గీరితెల్లా నీది
జట్టిగొని యిఁక నీ కిచ్చకమాడేఁగాక

(||pallavi||)
ĕṭṭu sesinām̐ jeyi yemanam̐gam̐gala ninnu
paṭṭina vradamu nīge pālubĕṭṭem̐gāga

(||ĕṭṭu||)
alugala sŏlayasu naṭṭĕ nīdom̐ bĕnam̐gusu
salamu sādiṁchenā sārĕsārĕgu
tŏluda nammiṁchidivi dosamum̐buṇyamu nīdi
mĕlam̐gi pāyamu nīge mīm̐dugaṭṭem̐gāga

(||ĕṭṭu||)
pŏṁtala sannulanŏtti bŏmmalanu jaṁkiṁchi
paṁtamu nīsem̐ gŏnenā balimidonu
siṁtado nannelina siggubaṭṭĕllā nīdi
baṁti nāyāsalu nībai vesem̐gāga

(||ĕṭṭu||)
nĕṭṭana ninnum̐ gūḍidi nerubulĕllām̐ jūbidi
aṭṭĕ ninnalayiṁchenā āraḍigānu
kaṭṭugo śhrī veṁkaḍeśha kaḍum̐ gīridĕllā nīdi
jaṭṭigŏni yim̐ka nī kichchagamāḍem̐gāga