Ettu sesinaam jeyi yeduraadanu

ఎట్టు సేసినాఁ జేయి యెదురాడను
Language

(॥పల్లవి॥)
ఎట్టు సేసినాఁ జేయి యెదురాడను
నెట్టుకొని చూచేవి నీ మహిమలిఁకను

(॥ఎట్టు॥)
మొగము నీవు చూచితే మొక్కుచును సంతోసింతు
నగితేనే నీ మేలు నమ్ముదు నేను
జిగి వీడెమిచ్చితేనే చెప్పుకొందుఁ జెలులతో
పగటు నీచిత్తము నాభాగ్యమిఁకను

(॥ఎట్టు॥)
మాటలు నీవాడితేనే మనసు గరఁగుదును
గాటానఁ జేయి వేసితేఁ గడు మెత్తును
పాటించి గోర నంటితే పలుమారుఁ జెలఁగుదు
కోటికి నీ కరుణే కోరితి నేనిఁకను

(॥ఎట్టు॥)
పచ్చడము గప్పితేను పలుమారు నిన్ను మెత్తు
మచ్చిక నీవు చూపితే మరుఁగుదును
ఇచ్చకుఁడ శ్రీవేంకటేశ నిన్నుఁ గూడితివి
పచ్చియైన నీ మన్ననే బ్రదుకు నాకిఁకను

(||pallavi||)
ĕṭṭu sesinām̐ jeyi yĕdurāḍanu
nĕṭṭugŏni sūsevi nī mahimalim̐kanu

(||ĕṭṭu||)
mŏgamu nīvu sūside mŏkkusunu saṁtosiṁtu
nagidene nī melu nammudu nenu
jigi vīḍĕmichchidene sĕppugŏṁdum̐ jĕlulado
pagaḍu nīsittamu nābhāgyamim̐kanu

(||ĕṭṭu||)
māḍalu nīvāḍidene manasu garam̐gudunu
gāḍānam̐ jeyi vesidem̐ gaḍu mĕttunu
pāḍiṁchi gora naṁṭide palumārum̐ jĕlam̐gudu
koḍigi nī karuṇe koridi nenim̐kanu

(||ĕṭṭu||)
pachchaḍamu gappidenu palumāru ninnu mĕttu
machchiga nīvu sūbide marum̐gudunu
ichchagum̐ḍa śhrīveṁkaḍeśha ninnum̐ gūḍidivi
pachchiyaina nī mannane bradugu nāgim̐kanu