Ettu sesinaa neesitta meduraadedaanam gaanu

ఎట్టు సేసినా నీచిత్త మెదురాడేదానఁ గాను
Language

(॥పల్లవి॥)
ఎట్టు సేసినా నీచిత్త మెదురాడేదానఁ గాను
పట్టి నీ పాదాలసేవే పదివేలు నాకు

(॥॥)
ఆసపడి మోహించిన అతివను నే నీతో
వాసులు వంతులు నెంచవచ్చునా మరి
పోసరించి జవ్వనమే పోగై వున్నదానను
వేసరఁ జెల్లునా నిన్నే వేఁడుకొనేఁ గాక

(॥॥)
యెప్పుడు వత్తువోయని యెదురుచూచే నేను
తప్పులుఁ దారులుఁ బట్టఁ దగవా నిన్ను
వుప్పతిల్లి సేసపాలు వొడిఁగట్టుకుందానను
నెప్పున నే నలిగేనా నీతో నవ్వేఁగాక

(॥॥)
నెమ్మది నీ కాఁగాలి నీకే మీఁదెత్తుకుండి
యెమ్మెలు నేతులుఁ జూపనేలా ఇఁక
నమ్మించి శ్రీవేంకటేశ నన్నిట్టె యేలుకొంటివి
కమ్మటి నే మరచేనా కడుమెచ్చేఁ గాక

(||pallavi||)
ĕṭṭu sesinā nīsitta mĕdurāḍedānam̐ gānu
paṭṭi nī pādālaseve padivelu nāgu

(||||)
āsabaḍi mohiṁchina adivanu ne nīdo
vāsulu vaṁtulu nĕṁchavachchunā mari
posariṁchi javvaname pogai vunnadānanu
vesaram̐ jĕllunā ninne vem̐ḍugŏnem̐ gāga

(||||)
yĕppuḍu vattuvoyani yĕdurusūse nenu
tappulum̐ dārulum̐ baṭṭam̐ dagavā ninnu
vuppadilli sesabālu vŏḍim̐gaṭṭuguṁdānanu
nĕppuna ne naligenā nīdo navvem̐gāga

(||||)
nĕmmadi nī kām̐gāli nīge mīm̐dĕttuguṁḍi
yĕmmĕlu nedulum̐ jūbanelā im̐ka
nammiṁchi śhrīveṁkaḍeśha nanniṭṭĕ yelugŏṁṭivi
kammaḍi ne marasenā kaḍumĕchchem̐ gāga