Ettu sesinaa neegu neduraadenaa

ఎట్టు సేసినా నీకు నెదురాడేనా
Language

(॥పల్లవి॥)
ఎట్టు సేసినా నీకు నెదురాడేనా
మట్టునఁ జెప్పననేటి మాట కింతేకాక

(॥ఎట్టు॥)
చెప్పవలశొకమాట చెప్పితి నింతెకాక
నెప్పున నా ఆయమెంత నే నెంత
యిప్పుడు నీసతినై యిట్టుండఁగఁ జూచినవాఁ
రుప్పటించే రనేమాట కొక్కటికె కాక

(॥ఎట్టు॥)
సొరిది నామేనికాఁక చూపితి నింతెకాక
నిరతి నాయలుకెంత నే నెంత
దొరవు నీవు చేపట్టి తుదఁ జింతించీ ననేటి-
పరులమాటలకు నేఁ బడఁ జాలఁ గాక

(॥ఎట్టు॥)
చెలఁగి నీమనసు రాఁజేరి నేఁ గూడితిఁ గాక
నిలువు నావలపెంత నే నెంత
నెలవై శ్రీవేంకటేశ నీవు మన్నించిన నేను
బలవంతురాలననే పంతానకె కాక

(||pallavi||)
ĕṭṭu sesinā nīgu nĕdurāḍenā
maṭṭunam̐ jĕppananeḍi māḍa kiṁtegāga

(||ĕṭṭu||)
sĕppavalaśhŏgamāḍa sĕppidi niṁtĕgāga
nĕppuna nā āyamĕṁta ne nĕṁta
yippuḍu nīsadinai yiṭṭuṁḍam̐gam̐ jūsinavām̐
ruppaḍiṁche ranemāḍa kŏkkaḍigĕ kāga

(||ĕṭṭu||)
sŏridi nāmenigām̐ka sūbidi niṁtĕgāga
niradi nāyalugĕṁta ne nĕṁta
dŏravu nīvu sebaṭṭi tudam̐ jiṁtiṁchī naneḍi-
parulamāḍalagu nem̐ baḍam̐ jālam̐ gāga

(||ĕṭṭu||)
sĕlam̐gi nīmanasu rām̐jeri nem̐ gūḍidim̐ gāga
niluvu nāvalabĕṁta ne nĕṁta
nĕlavai śhrīveṁkaḍeśha nīvu manniṁchina nenu
balavaṁturālanane paṁtānagĕ kāga