ఎట్టు సేసినా నీ చిత్త మింతే కాక
(॥పల్లవి॥)
ఎట్టు సేసినా నీ చిత్త మింతే కాక
తట్టి నిన్ను వెగ్గళించఁ దగునా మాకును
(॥ఎట్టు॥)
మంతన మాకెతో నాడి మరి నన్నుఁ గని లేచి
చెంత నా కిచ్చక మాడి చెక్కు నొక్కేవు
యింతటి మగవాఁడవు యేల నీ కింత వెఱపు
కాంతలము యేమి సేయఁ గల మయ్య నిన్నును
(॥ఎట్టు॥)
యిద్దరూఁ గూ డుండఁగాఁ జూ చిట్టె నేఁ దిరిగి రాఁగా
గద్దించి నాకొంగు వట్టి గడె వెట్టేవు
వుద్దండీఁడవు మాతోడ నూర కనుచర ణేల
అద్దో వూడిగపువార మవుఁ గా దనేమా
(॥ఎట్టు॥)
యిట్టె యాచెలియఁ గూడి యే మైనాఁ జేసుకొమ్మని
వొట్టుక నాపైఁ దెచ్చి వొళ్లు వేసేవు
నెట్టన శ్రీవెంకటేశ నే నలమేల్మంగను
ఱట్టడి నిన్నుఁ గూడి యాఱడికి నోపుదుమా
(||pallavi||)
ĕṭṭu sesinā nī sitta miṁte kāga
taṭṭi ninnu vĕggaḽiṁcham̐ dagunā māgunu
(||ĕṭṭu||)
maṁtana māgĕdo nāḍi mari nannum̐ gani lesi
sĕṁta nā kichchaga māḍi sĕkku nŏkkevu
yiṁtaḍi magavām̐ḍavu yela nī kiṁta vĕṟabu
kāṁtalamu yemi seyam̐ gala mayya ninnunu
(||ĕṭṭu||)
yiddarūm̐ gū ḍuṁḍam̐gām̐ jū siṭṭĕ nem̐ dirigi rām̐gā
gaddiṁchi nāgŏṁgu vaṭṭi gaḍĕ vĕṭṭevu
vuddaṁḍīm̐ḍavu mādoḍa nūra kanusara ṇela
addo vūḍigabuvāra mavum̐ gā danemā
(||ĕṭṭu||)
yiṭṭĕ yāsĕliyam̐ gūḍi ye mainām̐ jesugŏmmani
vŏṭṭuga nābaim̐ dĕchchi vŏḽlu vesevu
nĕṭṭana śhrīvĕṁkaḍeśha ne nalamelmaṁganu
ṟaṭṭaḍi ninnum̐ gūḍi yāṟaḍigi nobudumā