Ettu rakshimchevo kaani yimdiraaramana nannu

ఎట్టు రక్షించేవో కాని యిందిరారమణ నన్ను
Language

(॥పల్లవి॥)
ఎట్టు రక్షించేవో కాని యిందిరారమణ నన్ను
దట్టపు నీ దాసానుదాసుఁడ నేను

(॥ఎట్టు॥)
గాటపు వైరాగ్యము కందువ సుజ్ఞానము
మాటలలోననే కాని మతి నుండదు
నీటున నహంకారపు నీరసగుణములు
మాటునఁ దిరుగు దుర్మానుఁడ నేను

(॥ఎట్టు॥)
నవనవవిధముల నానాపుణ్యము
చెవుల వినుటే కాక సేయుట లేదు
భవజలధులలోన పడి పొరలి మునిఁగి
చవి మరిగిన నిత్యచపలుఁడ నేను

(॥ఎట్టు॥)
శ్రీవేంకటేశ్వర నీ సేవకుఁడ ననియేటి
భావ మొక్కటె కాని భక్తి యెఱుగ
యేవిధులఁ బడలేక యిటు నీకె శరణని
దేవులతో విఱ్ఱవీఁగే డింగరీఁడను

(||pallavi||)
ĕṭṭu rakṣhiṁchevo kāni yiṁdirāramaṇa nannu
daṭṭabu nī dāsānudāsum̐ḍa nenu

(||ĕṭṭu||)
gāḍabu vairāgyamu kaṁduva sujñānamu
māḍalalonane kāni madi nuṁḍadu
nīḍuna nahaṁkārabu nīrasaguṇamulu
māḍunam̐ dirugu durmānum̐ḍa nenu

(||ĕṭṭu||)
navanavavidhamula nānābuṇyamu
sĕvula vinuḍe kāga seyuḍa ledu
bhavajaladhulalona paḍi pŏrali munim̐gi
savi marigina nityasabalum̐ḍa nenu

(||ĕṭṭu||)
śhrīveṁkaḍeśhvara nī sevagum̐ḍa naniyeḍi
bhāva mŏkkaḍĕ kāni bhakti yĕṟuga
yevidhulam̐ baḍalega yiḍu nīgĕ śharaṇani
devulado viṭravīm̐ge ḍiṁgarīm̐ḍanu