Ettu nesinaa neesitta mimte kaaga

ఎట్టు నేసినా నీచిత్త మింతే కాక
Language

(॥పల్లవి॥)
ఎట్టు నేసినా నీచిత్త మింతే కాక
వట్టి జాలి నే నేల వాదు లడిచేను

(॥ఎట్టు॥)
చింత లేమిటికి నీవు చిత్తములో నుండఁగాను
పంత మేఁటికి నీవు చే పట్టి వుండఁగా
వింతదాననా నన్ను వేఁడుకొనే విప్పు డిట్టే
యెంత లేదు నీతో నే నేల యలిగేను

(॥ఎట్టు॥)
కోప మేఁటికి నీవు కొంగు వట్టు కుండఁ గాను
కైపు లేమిటికి నీవు గలి గుండఁగా
మాపుదాఁకానె నీకు మన్ననదానఁ గాన
యీపాటి కీపాటి యేల యలిగేను

(॥ఎట్టు॥)
వేసా లేమిటికి నీవు వేమారు నవ్వఁగాను
బాస లేమిటికి నన్నుఁ బచ్చినేయఁగా
ఆసగా శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
యీ సుద్దులకే నీతో నేల యలిగేను

(||pallavi||)
ĕṭṭu nesinā nīsitta miṁte kāga
vaṭṭi jāli ne nela vādu laḍisenu

(||ĕṭṭu||)
siṁta lemiḍigi nīvu sittamulo nuṁḍam̐gānu
paṁta mem̐ṭigi nīvu se paṭṭi vuṁḍam̐gā
viṁtadānanā nannu vem̐ḍugŏne vippu ḍiṭṭe
yĕṁta ledu nīdo ne nela yaligenu

(||ĕṭṭu||)
koba mem̐ṭigi nīvu kŏṁgu vaṭṭu kuṁḍam̐ gānu
kaibu lemiḍigi nīvu gali guṁḍam̐gā
mābudām̐kānĕ nīgu mannanadānam̐ gāna
yībāḍi kībāḍi yela yaligenu

(||ĕṭṭu||)
vesā lemiḍigi nīvu vemāru navvam̐gānu
bāsa lemiḍigi nannum̐ bachchineyam̐gā
āsagā śhrīvĕṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
yī suddulage nīdo nela yaligenu