Ettu nerusugomtive yemmelellaam joobamga

ఎట్టు నేరుచుకొంటివే యెమ్మెలెల్లాఁ జూపఁగ
Language

(॥పల్లవి॥)
ఎట్టు నేరుచుకొంటివే యెమ్మెలెల్లాఁ జూపఁగ
పెట్టిరా వెన్నతోడను పిన్ననాఁడే మీవారు

(॥ఎట్టు॥)
ఇద్దరి మన తగవు దిద్ది తేరిచినవాఁడు
వొద్దనే వున్నాఁడుగదే వువిద
పెద్దరికే లింతులతో బెట్టుగా నాడుకొనేవు
సుద్దులు నీచేత విని సోద్యమయ్యీఁగదవే

(॥ఎట్టు॥)
జంటై మనమాటలకు సాకిరియైన చెలులు
వింటా నున్నారు గదవే వెలఁది
వెంటనే నే జాణనంటా విక విక నవ్వేవు
కంటిమి నీగుణములు కతలాయఁగదవే

(॥ఎట్టు॥)
కందువ నిన్నూ నన్నుఁ గాఁగిటఁ గూడినవాఁడు
యెందును శ్రీవేంకటేశుఁ డితఁడే కదే
ముందే దొరతనాన మురిపెము చూపేవు
అందిపొంది నీవేసా లగడాయఁగదవే

(||pallavi||)
ĕṭṭu nerusugŏṁṭive yĕmmĕlĕllām̐ jūbam̐ga
pĕṭṭirā vĕnnadoḍanu pinnanām̐ḍe mīvāru

(||ĕṭṭu||)
iddari mana tagavu diddi terisinavām̐ḍu
vŏddane vunnām̐ḍugade vuvida
pĕddarige liṁtulado bĕṭṭugā nāḍugŏnevu
suddulu nīseda vini sodyamayyīm̐gadave

(||ĕṭṭu||)
jaṁṭai manamāḍalagu sāgiriyaina sĕlulu
viṁṭā nunnāru gadave vĕlam̐di
vĕṁṭane ne jāṇanaṁṭā viga viga navvevu
kaṁṭimi nīguṇamulu kadalāyam̐gadave

(||ĕṭṭu||)
kaṁduva ninnū nannum̐ gām̐giḍam̐ gūḍinavām̐ḍu
yĕṁdunu śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe kade
muṁde dŏradanāna muribĕmu sūbevu
aṁdibŏṁdi nīvesā lagaḍāyam̐gadave