Ettu nerusugomtiri iddaru meeru

ఎట్టు నేరుచుకొంటిరి ఇద్దరు మీరు
Language

(॥పల్లవి॥)
ఎట్టు నేరుచుకొంటిరి ఇద్దరు మీరు
దట్టమైన మీ సుద్దు లిందరు మెచ్చేరయ్యా

(॥॥)
సన్నపు గుబ్బలమీఁద చంద్రవంకలుగా నొత్తి
వెన్నెలపులుఁగాలాడే వేడుకకాఁడా
కిన్నెర వాయించేనంటా కెరలిన సిగ్గుతోడ
కన్నే మూసుకొనెను నీకంటే జాణయ్యా

(॥॥)
మమతఁ జెక్కులమీఁద మళ్లుగా గోరను గీరి
చెమట నీళ్లు గట్టే సేదెగాఁడ
తమిఁ బాదాలొ త్తేనంటా తనబుజాల నిడుక
కొమరె చెంపల నొత్తుకొనె మేలయ్యా

(॥॥)
చొక్కపుమోవిపైఁ గస్తూరి నిగరాలు నించి
పెక్కు వలపు లమ్మేటి బేరగాఁడ
నెక్కొని శ్రీవేంకటేశ నిన్నుఁ గాఁగిటఁ గూడీకె
మొక్కలాన నీతమ్ములానఁ గప్పెనయ్యా

(||pallavi||)
ĕṭṭu nerusugŏṁṭiri iddaru mīru
daṭṭamaina mī suddu liṁdaru mĕchcherayyā

(||||)
sannabu gubbalamīm̐da saṁdravaṁkalugā nŏtti
vĕnnĕlabulum̐gālāḍe veḍugagām̐ḍā
kinnĕra vāyiṁchenaṁṭā kĕralina siggudoḍa
kanne mūsugŏnĕnu nīgaṁṭe jāṇayyā

(||||)
mamadam̐ jĕkkulamīm̐da maḽlugā goranu gīri
sĕmaḍa nīḽlu gaṭṭe sedĕgām̐ḍa
tamim̐ bādālŏ ttenaṁṭā tanabujāla niḍuga
kŏmarĕ sĕṁpala nŏttugŏnĕ melayyā

(||||)
sŏkkabumovibaim̐ gastūri nigarālu niṁchi
pĕkku valabu lammeḍi beragām̐ḍa
nĕkkŏni śhrīveṁkaḍeśha ninnum̐ gām̐giḍam̐ gūḍīgĕ
mŏkkalāna nīdammulānam̐ gappĕnayyā