Ettu nerisidivayya yinni vaahanamulekka

ఎట్టు నేరిచితివయ్య యిన్ని వాహనములెక్క
Language

(॥పల్లవి॥)
ఎట్టు నేరిచితివయ్య యిన్ని వాహనములెక్క
గట్టిగా నిందుకే హరి కడు మెచ్చేమయ్యా

(॥ఎట్టు॥)
గరుడునిమీఁద నెక్కి గమనించితివి నాఁడు
అరుదైన పారిజాతహరణానకు
గరిమతో రథమెక్కి కదలితి వల్లనాఁడు
సొరిది బ్రాహ్మణపడచుల నుద్దరించను

(॥ఎట్టు॥)
చక్కఁగాఁ గుబేరుని పుష్కక మెక్కి కదలితి
మక్కువ సీతాదేవి మరలించను
తక్కక వాయుజు నెక్కి దాడి వెటితివి నాఁడు
చొక్కపువానరులపౌఁజులు చూడను

(॥ఎట్టు॥)
కొట్టఁగొన నీవు రాతిగుఱ్ఱము నెక్కి తోలితి-
పట్టియెడ నధర్మము నడఁచఁగను
మెట్టుక శ్రీవేంకటాద్రిమీఁదఁ బల్లకి యెక్కితిఁ
విట్టె యిందిరఁ గూడి యేఁగుబెండ్లి యేఁగను

(||pallavi||)
ĕṭṭu nerisidivayya yinni vāhanamulĕkka
gaṭṭigā niṁduge hari kaḍu mĕchchemayyā

(||ĕṭṭu||)
garuḍunimīm̐da nĕkki gamaniṁchidivi nām̐ḍu
arudaina pārijādaharaṇānagu
garimado rathamĕkki kadalidi vallanām̐ḍu
sŏridi brāhmaṇabaḍasula nuddariṁchanu

(||ĕṭṭu||)
sakkam̐gām̐ guberuni puṣhkaga mĕkki kadalidi
makkuva sīdādevi maraliṁchanu
takkaga vāyuju nĕkki dāḍi vĕḍidivi nām̐ḍu
sŏkkabuvānarulabaum̐julu sūḍanu

(||ĕṭṭu||)
kŏṭṭam̐gŏna nīvu rādiguṭramu nĕkki tolidi-
paṭṭiyĕḍa nadharmamu naḍam̐sam̐ganu
mĕṭṭuga śhrīveṁkaḍādrimīm̐dam̐ ballagi yĕkkidim̐
viṭṭĕ yiṁdiram̐ gūḍi yem̐gubĕṁḍli yem̐ganu