Ettu nammirogo ninnu imtaga tollidivaaru

ఎట్టు నమ్మిరొకొ నిన్ను ఇంతక తొల్లిటివారు
Language

(॥పల్లవి॥)
ఎట్టు నమ్మిరొకొ నిన్ను ఇంతక తొల్లిటివారు
వొట్టి నే నైతే మెచ్చితి నొక్క వేలనే

(॥ఎట్టు॥)
దాయలతలలు గొట్టి దనుజకాంతల గుబ్బ
లాయము లంటితిగా ఆచేతనే
చేరఁ బాముఁ జంపి చేరి గొల్ల తలయిండ్లఁ
నాయడ వెన్నలు దింటి వాచేతనే

(॥ఎట్టు॥)
వూతకఁ బీరిచి నీపొలతులధరపానా
లాతలఁ జేసితిగా ఆనోరనే
గాతల కౌరవుఁ దిట్టి కందువ సాందీపునితో
ఆతుమవేదాలు నేర్చి తానోరనే

(॥ఎట్టు॥)
అట్టే కంసు నెరపించి అంగనల సన్న నేని
తట్టు నిట్టు కాఁక దేర నాకన్నులనే
గుట్టున శ్రీ వేంకటేశ కూడితివి నన్ను నిట్టె
అట్టలు గట్ట నవ్వితి నాకన్నులనే

(||pallavi||)
ĕṭṭu nammirŏgŏ ninnu iṁtaga tŏlliḍivāru
vŏṭṭi ne naide mĕchchidi nŏkka velane

(||ĕṭṭu||)
dāyaladalalu gŏṭṭi danujagāṁtala gubba
lāyamu laṁṭidigā āsedane
seram̐ bāmum̐ jaṁpi seri gŏlla talayiṁḍlam̐
nāyaḍa vĕnnalu diṁṭi vāsedane

(||ĕṭṭu||)
vūdagam̐ bīrisi nībŏladuladharabānā
lādalam̐ jesidigā ānorane
gādala kauravum̐ diṭṭi kaṁduva sāṁdībunido
ādumavedālu nersi tānorane

(||ĕṭṭu||)
aṭṭe kaṁsu nĕrabiṁchi aṁganala sanna neni
taṭṭu niṭṭu kām̐ka dera nāgannulane
guṭṭuna śhrī veṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
aṭṭalu gaṭṭa navvidi nāgannulane