ఎట్టు నమ్మించేవో నీవే యెరుఁగుదువు
(॥పల్లవి॥)
ఎట్టు నమ్మించేవో నీవే యెరుఁగుదువు
ఇట్టె అన్నిపనులు నెంచుకొని వున్నది
(॥॥)
మనసు రంజిల్ల నీతో మాటలాడెఁగాని చెలి
వెనుకటిసుద్దులెల్లా వినియున్నది
యెనసి వేడుకతో నీ కిచ్చమాడీఁ గాని
అనుగు నీ గుణములు అరసే ననున్నది
(॥॥)
సెలవి నవ్వుదెచ్చుక చేరి నీతో నవ్వెఁగాని
కలికి నీచేఁతలెల్లాఁ గని వున్నది
వలచినదై నీతో వాదించఁజాలదు గాని
సొలసి నిన్నేకతాన సోదించే ననున్నది
(॥॥)
ఆసలు మానఁగలేక అట్టెనిన్నుఁ గూడెఁగాని
బాసలు నేయించుకొన్నఁబరగున్నది
లాసి శ్రీ వేంకటేశ నీలాగు దెలిసెఁగావి
మూసినముత్యమై నీ ముంగిటనే వున్నది
(||pallavi||)
ĕṭṭu nammiṁchevo nīve yĕrum̐guduvu
iṭṭĕ annibanulu nĕṁchugŏni vunnadi
(||||)
manasu raṁjilla nīdo māḍalāḍĕm̐gāni sĕli
vĕnugaḍisuddulĕllā viniyunnadi
yĕnasi veḍugado nī kichchamāḍīm̐ gāni
anugu nī guṇamulu arase nanunnadi
(||||)
sĕlavi navvudĕchchuga seri nīdo navvĕm̐gāni
kaligi nīsem̐talĕllām̐ gani vunnadi
valasinadai nīdo vādiṁcham̐jāladu gāni
sŏlasi ninnegadāna sodiṁche nanunnadi
(||||)
āsalu mānam̐galega aṭṭĕninnum̐ gūḍĕm̐gāni
bāsalu neyiṁchugŏnnam̐baragunnadi
lāsi śhrī veṁkaḍeśha nīlāgu dĕlisĕm̐gāvi
mūsinamutyamai nī muṁgiḍane vunnadi