ఎట్టు నమ్మించవచ్చునే ఇప్పుడు నిన్ను
(॥పల్లవి॥)
ఎట్టు నమ్మించవచ్చునే ఇప్పుడు నిన్ను
చుట్టి చుట్టి రమణుని సొలయవచ్చేవు
(॥ఎట్టు॥)
ముసుఁగు దెరచి నీమో మితఁడు చూడఁగాను
కొసరే విదేమిటికే కొచ్చి కొచ్చి
యెసఁగి పానుపు మీఁద నిందాఁకా నిద్దిరించితే
పొసఁగ రతులయలపులని యాడేవు
(॥ఎట్టు॥)
మలఁగుపై నొరగుచు మాటలు నీతో నాడితే
బులియుచుఁ జూచేవేమే పొంచి పొంచి
కొలువున నిందాఁక కూచుండి వచ్చితేను
పొలసి యెవ్వతోచింతఁ బొరలీ ననేవు
(॥ఎట్టు॥)
కడనుండేతెంచి నిన్నుఁగాఁగిలించి కూడితేను
మెడయెత్తి నవ్వేవేమే మెచ్చి మెచ్చి
యెడయక శ్రీవేంకటేశుఁ డిందాఁకా వచ్చితే
పడఁతి దొరకకుంటే పైకొనె ననేవు
(||pallavi||)
ĕṭṭu nammiṁchavachchune ippuḍu ninnu
suṭṭi suṭṭi ramaṇuni sŏlayavachchevu
(||ĕṭṭu||)
musum̐gu dĕrasi nīmo midam̐ḍu sūḍam̐gānu
kŏsare videmiḍige kŏchchi kŏchchi
yĕsam̐gi pānubu mīm̐da niṁdām̐kā niddiriṁchide
pŏsam̐ga radulayalabulani yāḍevu
(||ĕṭṭu||)
malam̐gubai nŏragusu māḍalu nīdo nāḍide
buliyusum̐ jūseveme pŏṁchi pŏṁchi
kŏluvuna niṁdām̐ka kūsuṁḍi vachchidenu
pŏlasi yĕvvadosiṁtam̐ bŏralī nanevu
(||ĕṭṭu||)
kaḍanuṁḍedĕṁchi ninnum̐gām̐giliṁchi kūḍidenu
mĕḍayĕtti navveveme mĕchchi mĕchchi
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ ḍiṁdām̐kā vachchide
paḍam̐ti dŏragaguṁṭe paigŏnĕ nanevu