ఎట్టు నమ్మవచ్చునే ఇంతి నీ మనసు నేఁడు
(॥పల్లవి॥)
ఎట్టు నమ్మవచ్చునే ఇంతి నీ మనసు నేఁడు
వొట్టి యొకవేళ బుద్ది యొకవేళ వచ్చునా
(॥॥)
వెన్నెలబయట నుండి వేఁడిఁబడి యిందాఁకా
సన్నల నీపతిఁ గూడి చల్లనైతివి
వున్నతపుఁజందురుఁడొక్కఁడే వెన్నెలొక్కటే
కన్నెభావాలు రెండుగతులాయ నివిగో
(॥॥)
కోయిలకూఁతలకే గుండె బెదరి యిందాఁకా
యీయొడ నీపతిఁగూడి యిచ్చగించేవు
ఆయెడాఁ బలుకొక్కటే అప్పటి నీవు నీవే
రాయడి నీగుణములే రండు దెఱఁగులాయ
(॥॥)
వేడుక చల్లగాలికి విసిగితి విందాఁకా
కూడి శ్రీవేంకటేశుతో కోరే వదియే
ఆడనే నీయాలవట్ట మదియును నొకటే
యీడా నాడాఁ దలపోఁత లివియే వేరు
(||pallavi||)
ĕṭṭu nammavachchune iṁti nī manasu nem̐ḍu
vŏṭṭi yŏgaveḽa buddi yŏgaveḽa vachchunā
(||||)
vĕnnĕlabayaḍa nuṁḍi vem̐ḍim̐baḍi yiṁdām̐kā
sannala nībadim̐ gūḍi sallanaidivi
vunnadabum̐jaṁdurum̐ḍŏkkam̐ḍe vĕnnĕlŏkkaḍe
kannĕbhāvālu rĕṁḍugadulāya nivigo
(||||)
koyilagūm̐talage guṁḍĕ bĕdari yiṁdām̐kā
yīyŏḍa nībadim̐gūḍi yichchagiṁchevu
āyĕḍām̐ balugŏkkaḍe appaḍi nīvu nīve
rāyaḍi nīguṇamule raṁḍu dĕṟam̐gulāya
(||||)
veḍuga sallagāligi visigidi viṁdām̐kā
kūḍi śhrīveṁkaḍeśhudo kore vadiye
āḍane nīyālavaṭṭa madiyunu nŏgaḍe
yīḍā nāḍām̐ dalabom̐ta liviye veru