Ettu nammavachchu ninnu nimta kaadareemdavu

ఎట్టు నమ్మవచ్చు నిన్ను నింత కాతరీఁడవు
Language

(॥పల్లవి॥)
ఎట్టు నమ్మవచ్చు నిన్ను నింత కాతరీఁడవు
యిట్టె యేపొద్దును నాయింటనే వున్నాఁడవు

(॥ఎట్టు॥)
అప్పుడే బాససేసితి వాపె ఇటు పొలసితే
తప్పక చూచేవు మతి దలపోసేవు
ముప్పిరిఁ దలవంచేవు ముదిత పాట పాడితే
కుప్పళించి పెంజెమట గురిసేవు మేనను

(॥ఎట్టు॥)
ఆయెడఁ బంతిమాడితి వాకె దండ గూచుండితే
కాయము సోఁకించేవు కరఁగేవు
నాయములు నడపేవు నడుమ నాపె నవ్వతే
పాయపు మదముతోడ భ్రమసే వెదుటను

(॥ఎట్టు॥)
అడరి నన్నేలితివి అస లాపె చూపితేను
కడు సిగ్గు విడిచేవు కాఁగిలించేవు
బడినే శ్రీవేంకటేశ పాయ కాపె నిలిచితే
వుడివోని రతులను నొరసేవు సారెను

(||pallavi||)
ĕṭṭu nammavachchu ninnu niṁta kādarīm̐ḍavu
yiṭṭĕ yebŏddunu nāyiṁṭane vunnām̐ḍavu

(||ĕṭṭu||)
appuḍe bāsasesidi vābĕ iḍu pŏlaside
tappaga sūsevu madi dalabosevu
muppirim̐ dalavaṁchevu mudida pāḍa pāḍide
kuppaḽiṁchi pĕṁjĕmaḍa gurisevu menanu

(||ĕṭṭu||)
āyĕḍam̐ baṁtimāḍidi vāgĕ daṁḍa gūsuṁḍide
kāyamu som̐kiṁchevu karam̐gevu
nāyamulu naḍabevu naḍuma nābĕ navvade
pāyabu madamudoḍa bhramase vĕduḍanu

(||ĕṭṭu||)
aḍari nannelidivi asa lābĕ sūbidenu
kaḍu siggu viḍisevu kām̐giliṁchevu
baḍine śhrīveṁkaḍeśha pāya kābĕ niliside
vuḍivoni radulanu nŏrasevu sārĕnu