Ettu nammavachchu ninnu niduvamtivaanini

ఎట్టు నమ్మవచ్చు నిన్ను నిటువంటివానిని
Language

(॥పల్లవి॥)
ఎట్టు నమ్మవచ్చు నిన్ను నిటువంటివానిని
నెట్టన నేఁడిదె నిన్ను మఱచితివి

(॥॥)
కాటుకకన్నుల నాకె గక్కన నిన్నుఁ జూచితే
మాటలు నాతో నాడేది మఱచితిగా
చీటికిమాటికి నట్టే చిరునవ్వు నవ్వెనంటా
నాటిన మనసుతోడ నన్ను మఱచితివి

(॥॥)
పెద్దబెట్టుమాట లాడి పిలిచెనంటానే
వొద్దునున్న నన్ను మఱ చుస్సురంటివి
ముద్దు చూపి దవ్వులనే మెఱఁగులు చల్లితేనే
పొద్దుగూఁకుపొడవు లిప్పుడే మఱచితివి

(॥॥)
చిగురుఁజేతుల నాకె చేసన్న సేసితేనే
తగవు మఱచితిగా దగ్గర నుండే
మిగులా శ్రీ వేంకటేశ మించునా కాఁగిటఁ గూడి
అగపడి రతిఁ జిక్కి అన్నీ మఱచితివి

(||pallavi||)
ĕṭṭu nammavachchu ninnu niḍuvaṁṭivānini
nĕṭṭana nem̐ḍidĕ ninnu maṟasidivi

(||||)
kāḍugagannula nāgĕ gakkana ninnum̐ jūside
māḍalu nādo nāḍedi maṟasidigā
sīḍigimāḍigi naṭṭe sirunavvu navvĕnaṁṭā
nāḍina manasudoḍa nannu maṟasidivi

(||||)
pĕddabĕṭṭumāḍa lāḍi pilisĕnaṁṭāne
vŏddununna nannu maṟa sussuraṁṭivi
muddu sūbi davvulane mĕṟam̐gulu sallidene
pŏddugūm̐kubŏḍavu lippuḍe maṟasidivi

(||||)
sigurum̐jedula nāgĕ sesanna sesidene
tagavu maṟasidigā daggara nuṁḍe
migulā śhrī veṁkaḍeśha miṁchunā kām̐giḍam̐ gūḍi
agabaḍi radim̐ jikki annī maṟasidivi