Ettu maṟadu neebhaaga mevvadegum gala dimka

ఎట్టు మఱతు నీభాగ మెవ్వతెకుఁ గల దిఁక
Language

(॥పల్లవి॥)
ఎట్టు మఱతు నీభాగ మెవ్వతెకుఁ గల దిఁక
యిట్టె యేకతాన నుండి ఇవె తలఁతురాఁ

(॥ఎట్టు॥)
వుక్కుమీర జగడించి వొట్టు వెట్టుకొని లేచి
గక్కన మంచము దిగఁగా నన్నుఁ జూచి
పక్కన నీ వంటఁ బట్టి పాపటపై గోరు మోపి
చొక్కించి మోవి యానితి సొంపు లివి చాలవా

(॥ఎట్టు॥)
పెనఁగి చేతులు విడిపంచుక ని న్నాన వెట్టి
కనలి గడె దెరవఁగా నీవు చూచి
చనుఁగొంగు జారదీసి సరిచెక్కు చేత నొక్కి
యెనముఁ దమ్ముల మిడి తిది యింత చాలదా

(॥ఎట్టు॥)
బొమ్మలనే జంకించి బూతుల మాటలాడి
కమ్మర నాయితపడఁగా నన్ను జూచి
చిమ్ముల శ్రీవేంకటేశ చెక్కు చెక్కుఁ గదియించి
నెమ్మిఁ గూడి పానుపుపై నిలిపతి చాలదా

(||pallavi||)
ĕṭṭu maṟadu nībhāga mĕvvadĕgum̐ gala dim̐ka
yiṭṭĕ yegadāna nuṁḍi ivĕ talam̐turām̐

(||ĕṭṭu||)
vukkumīra jagaḍiṁchi vŏṭṭu vĕṭṭugŏni lesi
gakkana maṁchamu digam̐gā nannum̐ jūsi
pakkana nī vaṁṭam̐ baṭṭi pābaḍabai goru mobi
sŏkkiṁchi movi yānidi sŏṁpu livi sālavā

(||ĕṭṭu||)
pĕnam̐gi sedulu viḍibaṁchuga ni nnāna vĕṭṭi
kanali gaḍĕ dĕravam̐gā nīvu sūsi
sanum̐gŏṁgu jāradīsi sarisĕkku seda nŏkki
yĕnamum̐ dammula miḍi tidi yiṁta sāladā

(||ĕṭṭu||)
bŏmmalane jaṁkiṁchi būdula māḍalāḍi
kammara nāyidabaḍam̐gā nannu jūsi
simmula śhrīveṁkaḍeśha sĕkku sĕkkum̐ gadiyiṁchi
nĕmmim̐ gūḍi pānububai nilibadi sāladā