Ettu mannimchevogaani idivo nee sittamu

ఎట్టు మన్నించేవోకాని ఇదివో నీ చిత్తము
Language

(॥పల్లవి॥)
ఎట్టు మన్నించేవోకాని ఇదివో నీ చిత్తము
మెట్టిపట్టుకొని నవ్వ మేనదాననా

(॥॥)
కొలువు సేసి నిన్నుఁ గొసరుదు నింతేకాక
చలపట్టి దూరఁగ నీసరిదాననా
పిలిచి నీ కప్పటిని ప్రియము చెప్పుదుఁ గాక
బలిమి సేయఁ గ నీతోఁ బంతగతైనా

(॥॥)
కైకొమ్మనుచు నీకుఁగా నీకొసఁగుదుఁ గాక
దీకొని మాఁటలాడఁగ దిట్టదాననా
మేకొని సేవలు సేసి మెప్పించఁ గలఁ గాక
కాకుసెయ నేమైనాఁ గడదాననా

(॥॥)
దేవులనై నీచేతఁ దేజము చేకొందుఁ గాక
వావాత నానవెట్ట వంతు దాననా
శ్రీ వేంకటేశ యిట్టే చేరి నన్నుఁ గూడితివి
సేవతో మొక్కుదుఁ గాక జీరదీసేదాననా

(||pallavi||)
ĕṭṭu manniṁchevogāni idivo nī sittamu
mĕṭṭibaṭṭugŏni navva menadānanā

(||||)
kŏluvu sesi ninnum̐ gŏsarudu niṁtegāga
salabaṭṭi dūram̐ga nīsaridānanā
pilisi nī kappaḍini priyamu sĕppudum̐ gāga
balimi seyam̐ ga nīdom̐ baṁtagadainā

(||||)
kaigŏmmanusu nīgum̐gā nīgŏsam̐gudum̐ gāga
dīgŏni mām̐ṭalāḍam̐ga diṭṭadānanā
megŏni sevalu sesi mĕppiṁcham̐ galam̐ gāga
kāgusĕya nemainām̐ gaḍadānanā

(||||)
devulanai nīsedam̐ dejamu segŏṁdum̐ gāga
vāvāda nānavĕṭṭa vaṁtu dānanā
śhrī veṁkaḍeśha yiṭṭe seri nannum̐ gūḍidivi
sevado mŏkkudum̐ gāga jīradīsedānanā