ఎట్టు మన్నించేవో యిటువంటిది నా వోజ
(॥పల్లవి॥)
ఎట్టు మన్నించేవో యిటువంటిది నా వోజ
యిట్టె చిత్తానఁ బెట్టు యిది నా విన్నపము
(॥ఎట్టు॥)
చూడకున్నా నా కన్నుల చూపులు నీపైఁ బారు
ఆడకున్నా నోరు మాఁటలాడు నీతోనే
యేడనున్నాఁ బాదాలు నీ యింటికే రప్పించును
యీడులేని నావలపు యింతసేసె నన్నును
(॥ఎట్టు॥)
తల వంచుకుండినాను తలఁపు నీపై నుండు
అలసినాఁ గూడించు నాస నీతోను
చెలఁగి సిగ్గున నున్నా సెలవులు నవ్వింపించు
యెలమి నా తమకము యెంతని చెప్పుదును
(॥ఎట్టు॥)
గుట్టుతోడనుండేనన్నా గుబ్బలు ని న్నొరయించు
ముట్టకున్నా నా చేతులు మొక్కించు నీకు
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
యెట్టిదో నా వేడుక యేమిసేతు నిఁకను
(||pallavi||)
ĕṭṭu manniṁchevo yiḍuvaṁṭidi nā voja
yiṭṭĕ sittānam̐ bĕṭṭu yidi nā vinnabamu
(||ĕṭṭu||)
sūḍagunnā nā kannula sūbulu nībaim̐ bāru
āḍagunnā noru mām̐ṭalāḍu nīdone
yeḍanunnām̐ bādālu nī yiṁṭige rappiṁchunu
yīḍuleni nāvalabu yiṁtasesĕ nannunu
(||ĕṭṭu||)
tala vaṁchuguṁḍinānu talam̐pu nībai nuṁḍu
alasinām̐ gūḍiṁchu nāsa nīdonu
sĕlam̐gi sigguna nunnā sĕlavulu navviṁpiṁchu
yĕlami nā tamagamu yĕṁtani sĕppudunu
(||ĕṭṭu||)
guṭṭudoḍanuṁḍenannā gubbalu ni nnŏrayiṁchu
muṭṭagunnā nā sedulu mŏkkiṁchu nīgu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
yĕṭṭido nā veḍuga yemisedu nim̐kanu