ఎట్టు మన్నించేవో నన్ను యిటువంటి వాఁడను
(॥పల్లవి॥)
ఎట్టు మన్నించేవో నన్ను యిటువంటి వాఁడను
దట్టపుటాసల నిన్నుఁ దడవుచున్నాఁడను
(॥ఎట్టు॥)
పలుమారు మొక్కఁగాను పరాకు సేసిన ట్టౌనో
మలసి జపించఁగాను మతి యెంత గరఁగునో
కొలువఁగా గొలువఁగా కొసరిన ట్టౌనో
తల పెఱుఁగక నిన్నుఁ దగులుచున్నాఁడను
(॥ఎట్టు॥)
చేరి పూజించఁగా నిన్నుఁ జిక్కించు కొన్న ట్టౌనో
సారె నారగింపంచగా చవి మరపిన ట్టౌనో
వూరకే సేవ సేయఁగా వొలవేసినట్టౌనో
నోరఁగొలఁదుల నిన్ను నుతింపుచున్నాఁడను
(॥ఎట్టు॥)
ఆటలాడి నవ్వించఁగా నలయించి నట్టౌనో
పాటించి శరణనఁగా పట్టి పెనఁగిన ట్టౌనో
వాటమై శ్రీవేంకటేశ వరదుఁడవు నీ వైతే
మేటి నా యాసల నిన్ను మెప్పించుచున్నాఁడను
(||pallavi||)
ĕṭṭu manniṁchevo nannu yiḍuvaṁṭi vām̐ḍanu
daṭṭabuḍāsala ninnum̐ daḍavusunnām̐ḍanu
(||ĕṭṭu||)
palumāru mŏkkam̐gānu parāgu sesina ṭṭauno
malasi jabiṁcham̐gānu madi yĕṁta garam̐guno
kŏluvam̐gā gŏluvam̐gā kŏsarina ṭṭauno
tala pĕṟum̐gaga ninnum̐ dagulusunnām̐ḍanu
(||ĕṭṭu||)
seri pūjiṁcham̐gā ninnum̐ jikkiṁchu kŏnna ṭṭauno
sārĕ nāragiṁpaṁchagā savi marabina ṭṭauno
vūrage seva seyam̐gā vŏlavesinaṭṭauno
noram̐gŏlam̐dula ninnu nudiṁpusunnām̐ḍanu
(||ĕṭṭu||)
āḍalāḍi navviṁcham̐gā nalayiṁchi naṭṭauno
pāḍiṁchi śharaṇanam̐gā paṭṭi pĕnam̐gina ṭṭauno
vāḍamai śhrīveṁkaḍeśha varadum̐ḍavu nī vaide
meḍi nā yāsala ninnu mĕppiṁchusunnām̐ḍanu