Ettu geluvamgavachchu nimtavaamdavu

ఎట్టు గెలువఁగవచ్చు నింతవాఁడవు
Language

(॥పల్లవి॥)
ఎట్టు గెలువఁగవచ్చు నింతవాఁడవు
గట్టిగా నీవే మమ్ముఁ గరుణించవయ్యా

(॥ఎట్టు ॥)
చలము మెరసి నిన్ను జంకించేనంటేను
మలసేటీబీరపుమగవాఁడవు
వలపురేఁచి నిన్ను వంచుకొనేనంటేను
కలికికాంతలు పెక్కుగలవాఁడవు

(॥ఎట్టు ॥)
పంతములాడి నిన్ను భ్రమఇంచేనంటేను
మంతుకెక్కిన రట్టడిమాసటీఁడవు
ఇంతలోనే మోవి లంచమిచ్చి చొక్కించేనంటేను
అంతకంతకును నీవు ఆసోదకాఁడవు

(॥ఎట్టు॥)
పట్టపుదేవులనె బలిమిఁ బెనఁగేనంటే
మట్టులేని రతులదిమ్మరివాఁడవు
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవె
గుట్టుసేసేనంటే మేకుల యెమ్మెకాఁడవు

(||pallavi||)
ĕṭṭu gĕluvam̐gavachchu niṁtavām̐ḍavu
gaṭṭigā nīve mammum̐ garuṇiṁchavayyā

(||ĕṭṭu ||)
salamu mĕrasi ninnu jaṁkiṁchenaṁṭenu
malaseḍībīrabumagavām̐ḍavu
valaburem̐si ninnu vaṁchugŏnenaṁṭenu
kaligigāṁtalu pĕkkugalavām̐ḍavu

(||ĕṭṭu ||)
paṁtamulāḍi ninnu bhrama̮iṁchenaṁṭenu
maṁtugĕkkina raṭṭaḍimāsaḍīm̐ḍavu
iṁtalone movi laṁchamichchi sŏkkiṁchenaṁṭenu
aṁtagaṁtagunu nīvu āsodagām̐ḍavu

(||ĕṭṭu||)
paṭṭabudevulanĕ balimim̐ bĕnam̐genaṁṭe
maṭṭuleni raduladimmarivām̐ḍavu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nīvĕ
guṭṭusesenaṁṭe megula yĕmmĕgām̐ḍavu