ఎట్టు గెలువఁగఁ గల వీకెను నీవు
(॥పల్లవి॥)
ఎట్టు గెలువఁగఁ గల వీకెను నీవు
యిట్టె మాటపట్లు నీ విచ్చితి విందరికి
(॥ఎట్టు॥)
మచ్చిక నీ వాకెతోడ మాటలాడ దొరకొంటే
పచ్చిగా నడుమ నీకె పాట వాడీని
యిచ్చగించి నీ వప్పటి నింతివద్ద గూచుండితే
తచ్చనతోఁ గొలువుకాంతలఁ బిలిచీని
(॥ఎట్టు॥)
తప్పక నీ వాకెదిక్కు తమకించి చూడఁబోతే
కప్పి సురటి మరఁగునా విసరీని
చొప్పు లెత్తి యందుకు సొలసి నవ్వఁ బూనితే
అప్పుడే కప్రము నోరి కందిచ్చీని
(॥ఎట్టు॥)
అక్కువ శ్రీవేంకటేశ ఆకెఁ గౌఁగిలించితేను
మొక్కుచుఁ బదకమురమునఁ బెట్టీని
యిక్కువతో నీపె నేలి యిందరి మ మ్మేలితివి
తక్కరీడఁ వాపెకంటె తా నిన్ను మెచ్చీని
(||pallavi||)
ĕṭṭu gĕluvam̐gam̐ gala vīgĕnu nīvu
yiṭṭĕ māḍabaṭlu nī vichchidi viṁdarigi
(||ĕṭṭu||)
machchiga nī vāgĕdoḍa māḍalāḍa dŏragŏṁṭe
pachchigā naḍuma nīgĕ pāḍa vāḍīni
yichchagiṁchi nī vappaḍi niṁtivadda gūsuṁḍide
tachchanadom̐ gŏluvugāṁtalam̐ bilisīni
(||ĕṭṭu||)
tappaga nī vāgĕdikku tamagiṁchi sūḍam̐bode
kappi suraḍi maram̐gunā visarīni
sŏppu lĕtti yaṁdugu sŏlasi navvam̐ būnide
appuḍe kapramu nori kaṁdichchīni
(||ĕṭṭu||)
akkuva śhrīveṁkaḍeśha āgĕm̐ gaum̐giliṁchidenu
mŏkkusum̐ badagamuramunam̐ bĕṭṭīni
yikkuvado nībĕ neli yiṁdari ma mmelidivi
takkarīḍam̐ vābĕgaṁṭĕ tā ninnu mĕchchīni