Ettu geluvamga vachchu niduvamtivaani ninnu

ఎట్టు గెలువంగ వచ్చు నిటువంటివాని నిన్ను
Language

(॥పల్లవి॥)
ఎట్టు గెలువంగ వచ్చు నిటువంటివాని నిన్ను
పట్టిన చలముతోడ భ్రమలఁ బెట్టితివి

(॥ఎట్టు॥)
మంచిమాట లాడఁగానె మఱచితి నిన్నియును
అంచెల నేఁ గోపగించే నంటా నుంటిని
యెంచి కన్ను లెఱ్ఱ చూడు యిటువంటిదాని నన్ను
మంచముమీఁదిఁకి దీసి మరిగించితివి

(॥ఎట్టు॥)
చెక్కు నీవు నొక్కఁగానె చిత్త మెల్లఁ గరఁగితి
అక్కరతోఁ గాఁగి లియ్య నంటా నుంటిని
మిక్కిలి నాకాఁక చూడు మీరి వచ్చేదాని నన్ను
వెక్కసాన నొడి వట్టి వెఱ్ఱిఁ జేసి తిపుడు

(॥ఎట్టు॥)
వొద్దికి నీవు రాఁగానె వొడఁబడితిఁ గాకిట్టె
అద్దలించి ఆన వెట్టే నంటా నుంటివి
గద్దరి శ్రీవెంకటేశ గబ్బి నైననన్నుఁ జూడు
ముద్దుమోము యిచ్చి కూడి మొక మోడించితివి

(||pallavi||)
ĕṭṭu gĕluvaṁga vachchu niḍuvaṁṭivāni ninnu
paṭṭina salamudoḍa bhramalam̐ bĕṭṭidivi

(||ĕṭṭu||)
maṁchimāḍa lāḍam̐gānĕ maṟasidi ninniyunu
aṁchĕla nem̐ gobagiṁche naṁṭā nuṁṭini
yĕṁchi kannu lĕṭra sūḍu yiḍuvaṁṭidāni nannu
maṁchamumīm̐dim̐ki dīsi marigiṁchidivi

(||ĕṭṭu||)
sĕkku nīvu nŏkkam̐gānĕ sitta mĕllam̐ garam̐gidi
akkaradom̐ gām̐gi liyya naṁṭā nuṁṭini
mikkili nāgām̐ka sūḍu mīri vachchedāni nannu
vĕkkasāna nŏḍi vaṭṭi vĕṭrim̐ jesi tibuḍu

(||ĕṭṭu||)
vŏddigi nīvu rām̐gānĕ vŏḍam̐baḍidim̐ gāgiṭṭĕ
addaliṁchi āna vĕṭṭe naṁṭā nuṁṭivi
gaddari śhrīvĕṁkaḍeśha gabbi nainanannum̐ jūḍu
muddumomu yichchi kūḍi mŏga moḍiṁchidivi