ఎట్టు గల్గెనయ్య యీ యెమ్మెలాఁడి నీకు నేఁడు
(॥పల్లవి॥)
ఎట్టు గల్గెనయ్య యీ యెమ్మెలాఁడి నీకు నేఁడు
చుట్టపు పరుసలనే సూడువట్టీ నిన్నును
(॥॥)
సన్నలనే నినుఁ గొంత సాదించీని
కిన్నెరమీఁటులనే గిలిగించీని
చన్నుల మొనలనే జాడచూపీని
యెన్నేసి చేఁతలు సేసీ నీపె నీఎదుటను
(॥॥)
నవ్వులనే తలఁపులు నారువోసీని
రవ్వలమాటలనే కరఁగఁ జేసిని
జవ్వనపుమే నంటించి చవిరేఁచీని
యెవ్వరు నేరిపిరో యీయింతికి నేరుపులు
(॥॥)
పూని పూని చూపులనే పొందుసేసీని
నానఁ బెట్టి నయాలనే నమ్మించీని
యే నలమేల్మంగను నన్నేలితి శ్రీ వేంకటేశ
కానుకిచ్చి తా నెన్నఁ డు కలసీనో నిన్నును
(||pallavi||)
ĕṭṭu galgĕnayya yī yĕmmĕlām̐ḍi nīgu nem̐ḍu
suṭṭabu parusalane sūḍuvaṭṭī ninnunu
(||||)
sannalane ninum̐ gŏṁta sādiṁchīni
kinnĕramīm̐ṭulane giligiṁchīni
sannula mŏnalane jāḍasūbīni
yĕnnesi sem̐talu sesī nībĕ nīĕduḍanu
(||||)
navvulane talam̐pulu nāruvosīni
ravvalamāḍalane karam̐gam̐ jesini
javvanabume naṁṭiṁchi savirem̐sīni
yĕvvaru neribiro yīyiṁtigi nerubulu
(||||)
pūni pūni sūbulane pŏṁdusesīni
nānam̐ bĕṭṭi nayālane nammiṁchīni
ye nalamelmaṁganu nannelidi śhrī veṁkaḍeśha
kānugichchi tā nĕnnam̐ ḍu kalasīno ninnunu