ఎట్టు గడించుకొంటివే ఇవి చక్కఁదనమంటా
(॥పల్లవి॥)
ఎట్టు గడించుకొంటివే ఇవి చక్కఁదనమంటా
చుట్టములు గావే అవే సూడిబంట్లు
(॥॥)
తామెరలవంటివేమో తరుణి నీకన్నులు ఆ-
తామెరలే మరునికి తగ బాణాలు
సోముని వంటిదే నీసొఁపైన మొగము ఆ-
సోముఁ డాతనిఁ గలసి జోడౌతెఱఁగవా
(॥॥)
జక్కవల బోలినవి తి నీకుచములు ఆ-
జక్కవలే మరునికిఁ జనవరులు
మిక్కిలితేంట్లఁ బోలె మేలిమి నీకురులు
పక్కన నాతని కవి బంట్లౌతెఱగవా
(॥॥)
చిగురుఁ బోలినదె చెలియ నీమేను ఆ-
చిగురేపో మరునికిఁ జేకత్తులు
నగుతా శ్రీవేంకటాద్రినాయకునిఁ గూడితివే
తగ నీతఁడే యాతనితండ్రౌ తెఱఁగవా
(||pallavi||)
ĕṭṭu gaḍiṁchugŏṁṭive ivi sakkam̐danamaṁṭā
suṭṭamulu gāve ave sūḍibaṁṭlu
(||||)
tāmĕralavaṁṭivemo taruṇi nīgannulu ā-
tāmĕrale marunigi taga bāṇālu
somuni vaṁṭide nīsŏm̐paina mŏgamu ā-
somum̐ ḍādanim̐ galasi joḍaudĕṟam̐gavā
(||||)
jakkavala bolinavi ti nīgusamulu ā-
jakkavale marunigim̐ janavarulu
mikkilideṁṭlam̐ bolĕ melimi nīgurulu
pakkana nādani kavi baṁṭlaudĕṟagavā
(||||)
sigurum̐ bolinadĕ sĕliya nīmenu ā-
sigurebo marunigim̐ jegattulu
nagudā śhrīveṁkaḍādrināyagunim̐ gūḍidive
taga nīdam̐ḍe yādanidaṁḍrau tĕṟam̐gavā