Ettu gadimche daivamu yimdarigini sukhamu

ఎట్టు గడించె దైవము యిందరికిని సుఖము
Language

(॥పల్లవి॥)
ఎట్టు గడించె దైవము యిందరికిని సుఖము
పట్టిన భ్రమవంటిది పంచేంద్రియ సుఖము

(॥ఎట్టు॥)
పచ్చివలెనో తోఁచు పండ్లు ముక్కలు వోవు
మచ్చికఁ గాంతలతోడి మదిన సుఖము
వచ్చి నట్ట నేవుండు పండ పండ నట్లౌను
తచ్చి తా తొల్లి చేసిన దాన ఫలసుఖము

(॥ఎట్టు॥)
మోవని యట్లే వుండు ములిగేపాటిభారము
భావించి యెత్తుకొన్న సంపద సుఖము
కైవసమైనట్లుండు కడదాఁకా వళకులే
తేవల ననుభవించే దేహభోగసుఖము

(॥ఎట్టు॥)
మిక్కిలి తీపై వుండు మీసాల మీఁదట తేనె
చక్కటి నానాఁటి సంసారసుఖము
తక్కక శ్రీవేంకటేశదాసులకు చిక్కివుండు
అక్కడ నిక్కడను బ్రహ్మానందసుఖము

(||pallavi||)
ĕṭṭu gaḍiṁchĕ daivamu yiṁdarigini sukhamu
paṭṭina bhramavaṁṭidi paṁcheṁdriya sukhamu

(||ĕṭṭu||)
pachchivalĕno tom̐su paṁḍlu mukkalu vovu
machchigam̐ gāṁtaladoḍi madina sukhamu
vachchi naṭṭa nevuṁḍu paṁḍa paṁḍa naṭlaunu
tachchi tā tŏlli sesina dāna phalasukhamu

(||ĕṭṭu||)
movani yaṭle vuṁḍu muligebāḍibhāramu
bhāviṁchi yĕttugŏnna saṁpada sukhamu
kaivasamainaṭluṁḍu kaḍadām̐kā vaḽagule
tevala nanubhaviṁche dehabhogasukhamu

(||ĕṭṭu||)
mikkili tībai vuṁḍu mīsāla mīm̐daḍa tenĕ
sakkaḍi nānām̐ṭi saṁsārasukhamu
takkaga śhrīveṁkaḍeśhadāsulagu sikkivuṁḍu
akkaḍa nikkaḍanu brahmānaṁdasukhamu