Ettu gadabeeno daiva mimtigi neegamda mimka

ఎట్టు గడపీనో దైవ మింతికి నీగండ మిఁక
Language

(॥పల్లవి॥)
ఎట్టు గడపీనో దైవ మింతికి నీగండ మిఁక
ముట్టివచ్చి ఇరుమేల మోహరించెఁ బనులు

(॥ఎట్టు॥)
జలజాక్షిమోము వాడె చంద్రుఁడు కళలుగూడె
కలికికన్నులు మూసె కలువలు లాసె
బలువూరుపులు దాఁగె పయ్యరగాలి రేఁగె
కులుకుమాట లణఁగె కోవిలలు గొణఁగె

(॥ఎట్టు॥)
చింతఁ జెలిమేను చిక్కె చిగురుకెంజాయ లెక్కె
వింతనవ్వులెల్లాఁ గుండె వెన్నెలలు పొంగె
దొంతిఁ దురుము విరిసె తుమ్మిదమూఁక మొరసె
మంతనాలు కరవాయ మరుఁడు యెరవాయ

(॥ఎట్టు॥)
చనుఁగొంగెడలె పంచశరుటెక్కెము వెడలె
వెనువెంటఁ బులకించె విరులెల్లఁ బొంచె
యెనసి శ్రీవేంకటేశుఁ డింతి నిట్టె కూడఁగాను
ననుపట్టె సేయఁ దమి నచ్చు గనమాయ

(||pallavi||)
ĕṭṭu gaḍabīno daiva miṁtigi nīgaṁḍa mim̐ka
muṭṭivachchi irumela mohariṁchĕm̐ banulu

(||ĕṭṭu||)
jalajākṣhimomu vāḍĕ saṁdrum̐ḍu kaḽalugūḍĕ
kaligigannulu mūsĕ kaluvalu lāsĕ
baluvūrubulu dām̐gĕ payyaragāli rem̐gĕ
kulugumāḍa laṇam̐gĕ kovilalu gŏṇam̐gĕ

(||ĕṭṭu||)
siṁtam̐ jĕlimenu sikkĕ sigurugĕṁjāya lĕkkĕ
viṁtanavvulĕllām̐ guṁḍĕ vĕnnĕlalu pŏṁgĕ
dŏṁtim̐ durumu virisĕ tummidamūm̐ka mŏrasĕ
maṁtanālu karavāya marum̐ḍu yĕravāya

(||ĕṭṭu||)
sanum̐gŏṁgĕḍalĕ paṁchaśharuḍĕkkĕmu vĕḍalĕ
vĕnuvĕṁṭam̐ bulagiṁchĕ virulĕllam̐ bŏṁchĕ
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍiṁti niṭṭĕ kūḍam̐gānu
nanubaṭṭĕ seyam̐ dami nachchu ganamāya