ఎట్టు దోయవచ్చు విని నెంతటివారికైనాను
(॥పల్లవి॥)
ఎట్టు దోయవచ్చు విని నెంతటివారికైనాను
పట్టి నీకు శరణంటే బ్రదికింతువు గాక
(॥ఎట్టు॥)
మాలతనమువంటిది మతిఁదగులుఁ గామము
అలరి ముట్టువంటిది అంటుఁగ్రోధము
కేలి నొదిగించు నెంగిలివంటిది లోభము
వాలాయించి నెందుండై నా వచ్చును లోకులకు
(॥ఎట్టు॥)
చుట్టి మద్యమువంటిది చొక్కించు మోహము
వట్టి మాంసమువంటిది వయోమదము
పుట్టిన భ్రమవంటిది పొదిగిన మచ్చరము
వుట్టిపడి నోరూరించు నూరకే ప్రాణులను
(॥ఎట్టు॥)
గోడమఱఁగు వంటిది గుట్టుతోడి సంసారము
వీడని కట్టువంటిది వేడుకయాస
యీడనే శ్రీవేంకటేశ యేలితివి నీదాసుల
జాడదప్పనియ్యవు యీచందము జీవులది
(||pallavi||)
ĕṭṭu doyavachchu vini nĕṁtaḍivārigainānu
paṭṭi nīgu śharaṇaṁṭe bradigiṁtuvu gāga
(||ĕṭṭu||)
māladanamuvaṁṭidi madim̐dagulum̐ gāmamu
alari muṭṭuvaṁṭidi aṁṭum̐grodhamu
keli nŏdigiṁchu nĕṁgilivaṁṭidi lobhamu
vālāyiṁchi nĕṁduṁḍai nā vachchunu logulagu
(||ĕṭṭu||)
suṭṭi madyamuvaṁṭidi sŏkkiṁchu mohamu
vaṭṭi māṁsamuvaṁṭidi vayomadamu
puṭṭina bhramavaṁṭidi pŏdigina machcharamu
vuṭṭibaḍi norūriṁchu nūrage prāṇulanu
(||ĕṭṭu||)
goḍamaṟam̐gu vaṁṭidi guṭṭudoḍi saṁsāramu
vīḍani kaṭṭuvaṁṭidi veḍugayāsa
yīḍane śhrīveṁkaḍeśha yelidivi nīdāsula
jāḍadappaniyyavu yīsaṁdamu jīvuladi