ఎట్టు దోయవచ్చు వీని నెంతటివాని కైనాను
(॥పల్లవి॥)
ఎట్టు దోయవచ్చు వీని నెంతటివాని కైనాను
పట్టి నీకు శరణంటే బ్రతికింతువు గాక
(॥ఎట్టు॥)
మాలతనముపంటిది మదిఁ దగులుఁ గామము
ఆలరి ముట్టువంటిది యంటుఁ గ్రోధము
కేలి నొదిగించు నెంగిలివంటిది లోభము
వాలాయించి యెందుండైనా వచ్చును లోకులకు
(॥ఎట్టు॥)
చుట్టి మద్యమువంటిది చొక్కించు మోహము
దట్టి మాంసమువంటిది వయోమదము
పుట్టిన భ్రమవంటిది పొదిగిన మచ్చరము
వుట్టిపడి నోహరించు నూరకే ప్రాణులను
(॥ఎట్టు॥)
గోడమఱఁగువంటిది గుట్టుతోడి సంసారము
వీడని కట్టువంటిది వేడుక యాసా
యీడనే శ్రీవేంకటేశ యేలితివి నీ దాసుల
జాడ దప్ప నియ్యవు యీ చందము జీవులది
(||pallavi||)
ĕṭṭu doyavachchu vīni nĕṁtaḍivāni kainānu
paṭṭi nīgu śharaṇaṁṭe bradigiṁtuvu gāga
(||ĕṭṭu||)
māladanamubaṁṭidi madim̐ dagulum̐ gāmamu
ālari muṭṭuvaṁṭidi yaṁṭum̐ grodhamu
keli nŏdigiṁchu nĕṁgilivaṁṭidi lobhamu
vālāyiṁchi yĕṁduṁḍainā vachchunu logulagu
(||ĕṭṭu||)
suṭṭi madyamuvaṁṭidi sŏkkiṁchu mohamu
daṭṭi māṁsamuvaṁṭidi vayomadamu
puṭṭina bhramavaṁṭidi pŏdigina machcharamu
vuṭṭibaḍi nohariṁchu nūrage prāṇulanu
(||ĕṭṭu||)
goḍamaṟam̐guvaṁṭidi guṭṭudoḍi saṁsāramu
vīḍani kaṭṭuvaṁṭidi veḍuga yāsā
yīḍane śhrīveṁkaḍeśha yelidivi nī dāsula
jāḍa dappa niyyavu yī saṁdamu jīvuladi