Ettu delusu maa kimtesi

ఎట్టు దెలుసు మా కింతేసి
Language

(॥పల్లవి॥)
ఎట్టు దెలుసు మా కింతేసి
దిట్టిలు మీరే తెలుసుకో రాదా

(॥ఎట్టు॥)
పలుకుల నీనేర్పు పచరించఁగా
కలకల నవ్వీఁ గామిని
అలరుచు మమ్మేమడిగేవు పతివి
తలఁపున నీవే తలఁచుకోరాదా

(॥ఎట్టు॥)
కప్పుచు నీవు సింగారించుకొనఁగాఁ
దప్పక చూచీఁ దరుణి
వొప్పుగ మమ్మేలొరసేవిటు నీ
చొప్పు నీవె తలఁచుకొనఁగ రాదా

(॥ఎట్టు॥)
యెనసి నీవు రతియింపులు చల్లఁగ
ఘనముగ మెచ్చీఁ గలికి
చెనకేవు మమ్మేల శ్రీవేంకటేశ్వర
తనియుచు నీవే తలఁచుకోరాదా

(||pallavi||)
ĕṭṭu dĕlusu mā kiṁtesi
diṭṭilu mīre tĕlusugo rādā

(||ĕṭṭu||)
palugula nīnerbu pasariṁcham̐gā
kalagala navvīm̐ gāmini
alarusu mammemaḍigevu padivi
talam̐puna nīve talam̐sugorādā

(||ĕṭṭu||)
kappusu nīvu siṁgāriṁchugŏnam̐gām̐
dappaga sūsīm̐ daruṇi
vŏppuga mammelŏraseviḍu nī
sŏppu nīvĕ talam̐sugŏnam̐ga rādā

(||ĕṭṭu||)
yĕnasi nīvu radiyiṁpulu sallam̐ga
ghanamuga mĕchchīm̐ galigi
sĕnagevu mammela śhrīveṁkaḍeśhvara
taniyusu nīve talam̐sugorādā