Ettu deliyamgavachchu nedaloni mee suddulu

ఎట్టు దెలియఁగవచ్చు నెదలోని మీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
ఎట్టు దెలియఁగవచ్చు నెదలోని మీ సుద్దులు
జట్టిగొన్న లోలోని జాణతనా లేఁటివో

(॥॥)
పవళించి నీ వుండఁగా పానుపువద్దఁ గూచుండి
చెవిలో విన్నప మేమిసేసీ నీకాపె
తవిలి నీ మొగము తప్పకచూచి యప్పటి
నవముగా సన్న సేసినవ్వీ నది యేఁటిదో

(॥॥)
పైకొని నీవింతులచే పాటలు వినకొనఁగా
ఆకుమీఁద నేమి వాఁసియంపీ నీకాపె
జోకతో నంతటిలోనే సొరిది నాయములంటి
రేకలు దీసి యెచ్చరించి నది యేఁటిదో

(॥॥)
కొలువుకూటములోన గుట్టుగా విచారించుకోఁగా
చెలిచే నీకేమి బుద్దిచెప్పించె నాపె
యెలిమి శ్రీ వేంకటేశ యిట్టె నన్ను నేలితివి
తలుపుమాఁటున నాకె తలపించె నేఁటిదో

(||pallavi||)
ĕṭṭu dĕliyam̐gavachchu nĕdaloni mī suddulu
jaṭṭigŏnna loloni jāṇadanā lem̐ṭivo

(||||)
pavaḽiṁchi nī vuṁḍam̐gā pānubuvaddam̐ gūsuṁḍi
sĕvilo vinnaba memisesī nīgābĕ
tavili nī mŏgamu tappagasūsi yappaḍi
navamugā sanna sesinavvī nadi yem̐ṭido

(||||)
paigŏni nīviṁtulase pāḍalu vinagŏnam̐gā
āgumīm̐da nemi vām̐siyaṁpī nīgābĕ
jogado naṁtaḍilone sŏridi nāyamulaṁṭi
regalu dīsi yĕchchariṁchi nadi yem̐ṭido

(||||)
kŏluvugūḍamulona guṭṭugā visāriṁchugom̐gā
sĕlise nīgemi buddisĕppiṁchĕ nābĕ
yĕlimi śhrī veṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
talubumām̐ṭuna nāgĕ talabiṁchĕ nem̐ṭido