ఎట్టు దరించఁగవచ్చు నిల్లాండ్లకు నూరిలోన
(॥పల్లవి॥)
ఎట్టు దరించఁగవచ్చు నిల్లాండ్లకు నూరిలోన
చుట్టమవై సిగ్గులెల్లా చూరలాడేవు
(॥॥)
మాయదారిమాట లాడి మనసులు మరిగించి
పాయపుగొల్లెతలను భ్రమయించేవు
చాయలుసన్నలుఁ జేసి చవులుగా మోవిచూపి
ఆయములు గరగించి ఆసరేఁచేవు
(॥॥)
సెలవుల నవ్వునవ్వి చిట్టంటుచేఁతలు నేసి
కలికిజవరాండ్లఁ గాఁకరేఁచేవు
ప్రియముల నవ్వునవ్వి పెంపుగఁ గాఁకలముంచి
నయగారితనమున నమ్మించేవు
(॥॥)
కన్నులఁ దప్పక చూచి కాఁగిటను బిగియించి
కన్నెలనుఁ జొక్కించి కైకొనేవు
అన్నిటా శ్రీవేంకటేశ ఆలమేలుమంగను నేను
మన్నించి నన్ను నేలి మంతనమాడేవు
(||pallavi||)
ĕṭṭu dariṁcham̐gavachchu nillāṁḍlagu nūrilona
suṭṭamavai siggulĕllā sūralāḍevu
(||||)
māyadārimāḍa lāḍi manasulu marigiṁchi
pāyabugŏllĕdalanu bhramayiṁchevu
sāyalusannalum̐ jesi savulugā movisūbi
āyamulu garagiṁchi āsarem̐sevu
(||||)
sĕlavula navvunavvi siṭṭaṁṭusem̐talu nesi
kaligijavarāṁḍlam̐ gām̐karem̐sevu
priyamula navvunavvi pĕṁpugam̐ gām̐kalamuṁchi
nayagāridanamuna nammiṁchevu
(||||)
kannulam̐ dappaga sūsi kām̐giḍanu bigiyiṁchi
kannĕlanum̐ jŏkkiṁchi kaigŏnevu
anniḍā śhrīveṁkaḍeśha ālamelumaṁganu nenu
manniṁchi nannu neli maṁtanamāḍevu