Ettu dappimchugovachchu yemtabamtamu laadinaa

ఎట్టు దప్పించుకోవచ్చు యెంతపంతము లాడినా
Language

(॥పల్లవి॥)
ఎట్టు దప్పించుకోవచ్చు యెంతపంతము లాడినా
పట్టరాని జవ్వనము బయలీఁతలు

(॥ఎట్టు॥)
చెలిచూపులు పతిని చిక్కించే అడియాసలు
తలవంచుకొనుటలే తరితీపులు
కలికిసన్నలు మంచికంకణదారములు
సొలపులసిగ్గులే చొక్కుమందులు

(॥ఎట్టు॥)
ముద్దులపలుకులే మునుకొన్న చిలుకలు
అద్దలింపుజంకెలు పాయనిలంకెలు
చద్దివేఁడికొసరులు జారనియెలఇంపులు
అద్దుకొన్నతిట్లవి మచ్చుమేపులు

(॥ఎట్టు॥)
వినయపుసరసాలు వీడరానిజిగురులు
చనవులకాఁగిళ్లు సరిబేసులు
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్ మంగను
పొనుగని మీరతు లెప్పుడు నీడుజోడులు

(||pallavi||)
ĕṭṭu dappiṁchugovachchu yĕṁtabaṁtamu lāḍinā
paṭṭarāni javvanamu bayalīm̐talu

(||ĕṭṭu||)
sĕlisūbulu padini sikkiṁche aḍiyāsalu
talavaṁchugŏnuḍale taridībulu
kaligisannalu maṁchigaṁkaṇadāramulu
sŏlabulasiggule sŏkkumaṁdulu

(||ĕṭṭu||)
muddulabalugule munugŏnna silugalu
addaliṁpujaṁkĕlu pāyanilaṁkĕlu
saddivem̐ḍigŏsarulu jāraniyĕla̮iṁpulu
addugŏnnadiṭlavi machchumebulu

(||ĕṭṭu||)
vinayabusarasālu vīḍarānijigurulu
sanavulagām̐giḽlu saribesulu
yĕnasidivi śhrīveṁkaḍeśha yalamel maṁganu
pŏnugani mīradu lĕppuḍu nīḍujoḍulu