ఎట్టు భ్రమయకుందుము యిటువంటి నిన్నుఁ జూచి
(॥పల్లవి॥)
ఎట్టు భ్రమయకుందుము యిటువంటి నిన్నుఁ జూచి
వుట్టిపడీ నిదివో నీ వొడఁబాటు పొందులు
(॥ఎట్టు॥)
పెచ్చురేఁగి వలచినప్రియురాండ్లకెల్లాను
మచ్చుమేఁపులాయను నీమంచిమాటలు
అచ్చలాన నీవుచూపే ఆస లందరికిఁ జేల-
పచ్చలాయ నిదివో నీబయకారిచేఁతలు
(॥ఎట్టు॥)
కాలుదొక్కినట్టి నీకామినుల కెల్లాను
పాలకూళ్లాయను నీపచ్చినవ్వులు
యీలాగులె ఇందరికి యీఁదులాడేనీటిలోని-
వోలలాయ నిదివో నీవుప్పవేసి పొత్తులు
(॥ఎట్టు॥)
మక్కువ నిన్నుఁ గూడినమముబోంట్లకల్లాను
చొక్కుమందులాయను నీసొంపురతులు
గక్కన శ్రీవేంకటేశ కలసితివి నీమేలు
రొక్కమాయ నిదివో నీరూడైనమన్ననలు
(||pallavi||)
ĕṭṭu bhramayaguṁdumu yiḍuvaṁṭi ninnum̐ jūsi
vuṭṭibaḍī nidivo nī vŏḍam̐bāḍu pŏṁdulu
(||ĕṭṭu||)
pĕchchurem̐gi valasinapriyurāṁḍlagĕllānu
machchumem̐pulāyanu nīmaṁchimāḍalu
achchalāna nīvusūbe āsa laṁdarigim̐ jela-
pachchalāya nidivo nībayagārisem̐talu
(||ĕṭṭu||)
kāludŏkkinaṭṭi nīgāminula kĕllānu
pālagūḽlāyanu nībachchinavvulu
yīlāgulĕ iṁdarigi yīm̐dulāḍenīḍiloni-
volalāya nidivo nīvuppavesi pŏttulu
(||ĕṭṭu||)
makkuva ninnum̐ gūḍinamamuboṁṭlagallānu
sŏkkumaṁdulāyanu nīsŏṁpuradulu
gakkana śhrīveṁkaḍeśha kalasidivi nīmelu
rŏkkamāya nidivo nīrūḍainamannanalu