Ettoruvavachchu yiduvamtivellam joosi

ఎట్టోరువవచ్చు యిటువంటివెల్లఁ జూచి
Language

(॥పల్లవి॥)
ఎట్టోరువవచ్చు యిటువంటివెల్లఁ జూచి
పట్టపగటనుండియు బడలె నీచెలియ

(॥ఎటోప॥)
పంతగాఁడవైనందుకు బలిమి గలయందుకు
నింతులతోఁ జూపేవా యెగసక్కేలు
యెంతదడవాకుమడిచిప్పించుకొనేవు నీవు
బంతినిట్టే నిలుచుండి బడలె నీచెలియ

(॥ఎటోప॥)
నేరుపరివైనందుకు నిజముగల యందుకు
ఆరీతిఁ దక్కింతురా యంగనలను
కోరి తొడలపైఁ జాఁచుకొంటివి నీపాదాలు
భారము మోచుకవుండి బడలె నీచెలియ

(॥ఎటోప॥)
యేలినందుకు శ్రీవేంకటేశుఁడవైనందుకు
జాలిఁబెట్టుదురా యింత సకియలను
వేళతోఁ గాఁగిటఁ గూడి వెలయ మన్నించితివి
ఆలరి రతులచేత నలసె నీచెలియ

(||pallavi||)
ĕṭṭoruvavachchu yiḍuvaṁṭivĕllam̐ jūsi
paṭṭabagaḍanuṁḍiyu baḍalĕ nīsĕliya

(||ĕḍoba||)
paṁtagām̐ḍavainaṁdugu balimi galayaṁdugu
niṁtuladom̐ jūbevā yĕgasakkelu
yĕṁtadaḍavāgumaḍisippiṁchugŏnevu nīvu
baṁtiniṭṭe nilusuṁḍi baḍalĕ nīsĕliya

(||ĕḍoba||)
nerubarivainaṁdugu nijamugala yaṁdugu
ārīdim̐ dakkiṁturā yaṁganalanu
kori tŏḍalabaim̐ jām̐sugŏṁṭivi nībādālu
bhāramu mosugavuṁḍi baḍalĕ nīsĕliya

(||ĕḍoba||)
yelinaṁdugu śhrīveṁkaḍeśhum̐ḍavainaṁdugu
jālim̐bĕṭṭudurā yiṁta sagiyalanu
veḽadom̐ gām̐giḍam̐ gūḍi vĕlaya manniṁchidivi
ālari radulaseda nalasĕ nīsĕliya