Ettivaariginella nittigarmamulu maa

ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా
Language

(॥పల్లవి॥)
ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా-
యెట్టివారికి నింక నేది తోవయ్య

(॥ఎట్టి॥)
పాముఁజంపిన యట్టిపాతకమునఁ బెద్ద -
పాముమీఁద నీకుఁ బవళించవలసె
కోమలిఁ జంపిన కోఱఁతవల్ల నొక్క-
కోమలి నెదఁ బెట్టుకొని యుండవలసె

(॥ఎట్టి॥)
బండి విఱిచినట్టి పాతకమునఁ బెద్ద
బండిబోయుఁడవై పనిసేయవలనె
కొండవెఱికి నట్టిగుణమునఁ దిరుమల-
కొండమీఁద నీకుఁ గూచుండవలసె

(||pallavi||)
ĕṭṭivāriginĕlla niṭṭigarmamulu mā-
yĕṭṭivārigi niṁka nedi tovayya

(||ĕṭṭi||)
pāmum̐jaṁpina yaṭṭibādagamunam̐ bĕdda -
pāmumīm̐da nīgum̐ bavaḽiṁchavalasĕ
komalim̐ jaṁpina koṟam̐tavalla nŏkka-
komali nĕdam̐ bĕṭṭugŏni yuṁḍavalasĕ

(||ĕṭṭi||)
baṁḍi viṟisinaṭṭi pādagamunam̐ bĕdda
baṁḍiboyum̐ḍavai paniseyavalanĕ
kŏṁḍavĕṟigi naṭṭiguṇamunam̐ dirumala-
kŏṁḍamīm̐da nīgum̐ gūsuṁḍavalasĕ